Lahari Shari: లగ్జరీ బైక్ ను కొనుగోలు చేసిన లహరి.. ధర ఎంతో తెలుసా?

లహరి షారి (Lahari Shari).. న్యూస్ యాంకర్,  జర్నలిస్ట్, మోడల్, యాక్టర్ (Actress).. ఇలా బహుముఖ ప్రజ్ఞ చాటుతున్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు

Lahari Shari: లగ్జరీ బైక్ ను కొనుగోలు చేసిన లహరి.. ధర ఎంతో తెలుసా?

Updated on: Jan 26, 2022 | 7:49 AM

లహరి షారి (Lahari Shari).. న్యూస్ యాంకర్,  జర్నలిస్ట్, మోడల్, యాక్టర్ (Actress).. ఇలా బహుముఖ ప్రజ్ఞ చాటుతున్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో డాక్టర్‌గా నటించి మెప్పించింది. ఆ తర్వాత మళ్లీ రావా, సారీ నాకు పెళ్లైంది, జాంబి రెడ్డి తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. అయితే బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ మరో లెవెల్ కు వెళ్లిపోయింది.  బుల్లితెర, వెండితెరపై వరుస ఆఫర్లను అందుకుంటోంది.   సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ అందాల తార తాజాగా ఓ లగ్జరీ బైక్ ను కొనుగోలు చేసినట్లు అభిమానులతో పంచుకుంది.

రైడ్ కు వెళదామా?

అనంతరం బైక్ తో దిగిన ఫొటోలను తన  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘మొత్తానికి ఈ బైక్‌ కొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా బైక్‌ సౌండ్‌ చాలా నచ్చింది’  అంటూ మురిసిపోయింది. కాగా BMW G 310 GS మోడల్‌కి చెందిన ఈ  లగ్జరీ బైక్‌ సుమారు రూ.3-3.5 లక్షలు ఉంటుందట.  ఇక కొత్త బైక్ ను కొన్న లహరీకి పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. సింగర్ శ్రీరామచంద్ర ‘ సూపర్ కూల్ బైక్’ అని కామెంట్ పెట్టగా , యానీ మాస్టర్ ‘రైడ్ కు వెళదామా’ అంటూ స్పందించింది.

Also Read: Ashu Reddy: జూనియర్ సామ్ వెనకనున్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తు పట్టారా?

Republic day 2022: రిపబ్లిడ్‌ డే శకటాలను ఎలా రూపొందిస్తారు? అసలు పరేడ్‌లో పాల్గొనే శకటాల ప్రక్రియ ఎంపికలో విధి విధానాలేంటంటే..

Dwayne Bravo: మైదానంలో ‘పుష్ప’ స్టెప్ వేసిన డ్వేన్ బ్రావో.. పరేషాన్ అవుతున్న ఫ్యాన్స్‌..