AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: ‘బిగ్‌బాస్‌ 4’ పండుగ ఎప్పటినుంచంటే!

బుల్లితెరపై సంచలనం సృష్టించేందుకు బిగ్‌బాస్ రెడీ అవుతోంది. ప్రేక్షకులకు అంతకుమించిన వినోదాన్ని ఇచ్చేలా ఈసారి నిర్వాహకులు ప్లాన్ చేశారు.

Bigg Boss 4: 'బిగ్‌బాస్‌ 4' పండుగ ఎప్పటినుంచంటే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 26, 2020 | 5:19 PM

Share

Bigg Boss 4 Telugu: బుల్లితెరపై సంచలనం సృష్టించేందుకు బిగ్‌బాస్ రెడీ అవుతోంది. ప్రేక్షకులకు అంతకుమించిన వినోదాన్ని ఇచ్చేలా ఈసారి నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే కంటెస్టెంట్‌లను ఫైనల్ చేసుకున్న నిర్వాహకులు, వారికి పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌లో ఉంచారట. కాగా ఈ సీజన్‌ని మొదట నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఈ నెల 29న ప్రారంభించాలని నిర్వాహకులు అనుకున్నారట. అయితే ప్రస్తుతం వస్తోన్న ఇస్మార్ట్ జోడీ ఫైనల్‌ ఎపిసోడ్‌ 29, 30న జరగనుంది. దీంతో తరువాత వారానికి బిగ్‌బాస్‌ వాయిదా పడిందట. అంటే సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ 4 ప్రారంభం కానుందని, దానికి సంబంధించి 5న షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.

ఇక ఈ సీజన్‌లో కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్‌, రఘు, డైరెక్టర్ సూర్య కిరణ్, నటి మోనాల్ గజ్జర్‌, నటి కరాటే కళ్యాణి, జబర్దస్త్‌ అవినాష్‌, యూట్యూబర్లు గంగవ్వ, మెహబూబ్ దిల్‌సే, దేత్తడి హారిక, సింగర్ నోయల్, యాంకర్ లాస్య మంజునాథ్‌, వీజే అరియానా గ్లోరీ, టీవీ నటుడు తనూజ పుట్టస్వామి, సయ్యద్‌ సొహైల్‌ ర్యాన్ తదితరులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

Read More:

5 మీటర్ల జుట్టు.. 80ఏళ్లుగా తల స్నానం కూడా చేయలేదట

మా నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు: నటి ఆరోపణలు

Follow Us