పున్నుకు ఏమైంది..! రాహుల్‌‌ దాడిపై మాట్లాడకపోవడానికి కారణమిదేనా..!

అంతకుముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. బిగ్‌బాస్ 3 ద్వారా మంచి ఫేమ్‌ను సంపాదించుకున్నారు నటి పునర్నవి. ముఖ్యంగా హౌస్‌లో రాహుల్‌తో కలిసి పునర్నవి చేసిన రొమాన్స్‌ను ఫ్యాన్స్ ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు.

పున్నుకు ఏమైంది..! రాహుల్‌‌ దాడిపై మాట్లాడకపోవడానికి కారణమిదేనా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 12, 2020 | 4:13 PM

అంతకుముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. బిగ్‌బాస్ 3 ద్వారా మంచి ఫేమ్‌ను సంపాదించుకున్నారు నటి పునర్నవి. ముఖ్యంగా హౌస్‌లో రాహుల్‌తో కలిసి పునర్నవి చేసిన రొమాన్స్‌ను ఫ్యాన్స్ ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. ఇక బిగ్‌బాస్ 3 నుంచి వచ్చిన తరువాత మొన్నటివరకు ఆమె కాస్త బిజీగానే కనిపించారు. అయితే ఉన్నట్లుండి ఈ మధ్యన సోషల్ మీడియాకు దూరమయ్యారు పునర్నవి. ఈ నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ తెగ వర్రీ అయ్యారు. తమ అభిమాన నటికి ఏమైందంటూ అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఈ మధ్యన రాహుల్‌పై దాడి జరిగిన సమయంలోనూ పునర్నవి ఏం స్పందించకపోవడంతో.. ఆమె ఎక్కడికి వెళ్లిందన్న ప్రశ్నలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో స్పందించి.. తనకు ఏమైందో చెప్పుకొచ్చారు పునర్నవి.

‘‘నేను మళ్లీ వెనక్కి వచ్చేశా. మీరు గమనించారో లేదో.. కొన్ని రోజులుగా సోషల్ మీడియా నుంచి నేను బ్రేక్ తీసుకున్నా. రీల్ జీవితంలో వచ్చిన ప్రశంసలతో నా మెంటల్ హెల్త్‌ను సరిగా పట్టించుకోలేదు. చిన్న విరామం తీసుకోవడం తప్పేం కాదు. కాస్త మానసిక స్వాంతన పొంది, మళ్లీ మన కెరీర్‌పై దృష్టి పెట్టడం మంచిదే. నేను ఇప్పుడే అదే చేశా. ఈ విరామంలో ఓ బుక్ చదివా. నాకు ఇష్టమైన వారితో సమయాన్ని వెచ్చించా. ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నా’’ అని పునర్నవి కామెంట్ పెట్టారు. కాగా ఆమె మాటలను బట్టి చూస్తే.. పునర్నవి డిప్రెషన్‌తో బాధపడ్డట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే రాహుల్‌పై దాడి జరిగిన సమయంలో ఆమె స్పందించలేదని వారి వారి అభిమానులు భావిస్తున్నారు.

https://www.instagram.com/p/B9jhgDQnzh4/?utm_source=ig_embed

Read This Story Also: కోలీవుడ్‌లో టెన్షన్.. విజయ్‌ ఇంట్లో మళ్లీ ఐటీ అధికారులు..!