‘బిగ్‌బాస్ 3’లోకి హేమ ఆంటీ..?

తెలుగు బుల్లితెర మీద మూడోసారి సెన్సేషన్ సృష్టించేందుకు బిగ్‌బాస్ సిద్ధమౌతోంది. ఈ నెల 21నుంచి బిగ్‌బాస్ 3 ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు ఈ సీజన్‌కు హోస్ట్‌గా చేయబోతున్న నాగార్జునకు సంబంధించిన మరో ప్రోమో తాజాగా విడుదలైంది. అయితే బిగ్‌బాస్ 3 ప్రారంభానికి మరో 8రోజులు మాత్రమే ఉండగా.. ఇందులో ఎవరెవరు పాల్గొంటారా..? అని అందరిలో ఆసక్తి నెలకొంది. మొదటి రెండు సీజన్లకు మించి ఈసారి సీజన్‌ను చేయాలనుకుంటున్న నిర్వాహకులు అందుకోసం పేరుమోసిన […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:15 am, Sat, 13 July 19
‘బిగ్‌బాస్ 3’లోకి హేమ ఆంటీ..?

తెలుగు బుల్లితెర మీద మూడోసారి సెన్సేషన్ సృష్టించేందుకు బిగ్‌బాస్ సిద్ధమౌతోంది. ఈ నెల 21నుంచి బిగ్‌బాస్ 3 ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు ఈ సీజన్‌కు హోస్ట్‌గా చేయబోతున్న నాగార్జునకు సంబంధించిన మరో ప్రోమో తాజాగా విడుదలైంది. అయితే బిగ్‌బాస్ 3 ప్రారంభానికి మరో 8రోజులు మాత్రమే ఉండగా.. ఇందులో ఎవరెవరు పాల్గొంటారా..? అని అందరిలో ఆసక్తి నెలకొంది. మొదటి రెండు సీజన్లకు మించి ఈసారి సీజన్‌ను చేయాలనుకుంటున్న నిర్వాహకులు అందుకోసం పేరుమోసిన వారినే ఎంపిక చేశారట. వారిలో ప్రముఖంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి.

అందులో ముఖ్యంగా నటి హేమ పేరు వినిపిస్తోంది. హేమ ఈ షోకు మొదటి ఆకర్షణ అవుతుందని భావించిన నిర్వాహకులు అందుకు ఆమెను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, డ్యాన్సర్ రవికృష్ణ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్‌ 3లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు పలు సీరియల్స్‌లో నటిస్తున్న వారిని నిర్వాహకులు ఎంపిక చేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుంది..? అసలు బిగ్‌బాస్ 3లో ఎవరెవరు ఉండబోతున్నారు..? నిర్వాహకులు ఎవరిని ఎంపిక చేశారు..? తెలుసుకోవాలంటే ఎనిమిది రోజులు ఆగాల్సిందే. అయితే రెండో సీజన్‌లో ఇద్దరు సామాన్యులకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులు ఈ సారి మాత్రం ఎవ్వరినీ ఎంపిక చేయలేదట. కాగా ఇక ఈ సీజన్‌లో మొత్తం 14మంది కంటెస్టెంట్‌లు పాల్గొననుండగా.. వంద రోజుల పాటు షోను నిర్వహించబోతున్న విషయం తెలిసిందే.