Bhola Shankar: అభిమానుల పల్స్‌ పట్టుకున్న మెహర్‌ రమేష్‌.. ఇదిగో అందుకు ఇదే సాక్ష్యం

చిరంజీవి నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు..? ఈ ఏజ్‌లో మెగాస్టార్ నుంచి సూపర్ హీరో కాన్సెప్టులు.. వినూత్నమైన ప్రయోగాలైతే కోరుకోరు కదా..! విందుభోజనం లాంటి మాస్ సినిమా చేస్తే చాలనునుకుంటారు. ఆ పల్స్ పట్టుకున్నారు మెహర్ రమేష్. భోళా శంకర్‌తో ఫుల్ మీల్స్ పెట్టే ప్రయత్నమైతే చేస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. అభిమానులకు ఏం కావాలో అవే అంశాలను సినిమాలో ఉండేలా చూసుకున్నారు మెహర్‌ రమేష్‌. ట్రైలర్‌ ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతోంది..

Bhola Shankar: అభిమానుల పల్స్‌ పట్టుకున్న మెహర్‌ రమేష్‌.. ఇదిగో అందుకు ఇదే సాక్ష్యం
Bhola Shankar

Edited By:

Updated on: Jul 28, 2023 | 9:40 PM

చిరంజీవి నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు..? ఈ ఏజ్‌లో మెగాస్టార్ నుంచి సూపర్ హీరో కాన్సెప్టులు.. వినూత్నమైన ప్రయోగాలైతే కోరుకోరు కదా..! విందుభోజనం లాంటి మాస్ సినిమా చేస్తే చాలనునుకుంటారు. ఆ పల్స్ పట్టుకున్నారు మెహర్ రమేష్. భోళా శంకర్‌తో ఫుల్ మీల్స్ పెట్టే ప్రయత్నమైతే చేస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. అభిమానులకు ఏం కావాలో అవే అంశాలను సినిమాలో ఉండేలా చూసుకున్నారు మెహర్‌ రమేష్‌. ట్రైలర్‌ ఇదే విషయాన్ని చెప్పకనే చెబుతోంది..

వాల్తేరు వీరయ్యతో చాలా రోజుల తర్వాత కాదు.. చాలా ఏళ్ళ తర్వాత వింటేజ్ మెగాస్టార్ కనిపించారు. మెసేజ్‌లు ఏం లేకుండా.. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా చేసారు చిరు. దాని రిజల్ట్ అదిరింది. దాంతో అదే ఊపు కంటిన్యూ చేయడానికి భోళా శంకర్‌తో వచ్చేస్తున్నారు మెగాస్టార్. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇందులో చిరును చూసి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు.

చిరు ఇమేజ్‌కు తగ్గట్లు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మెహర్ రమేష్. నో ఎక్స్‌పర్మెంట్స్.. ఓన్లీ ఎంటర్‌టైన్మెంట్ అనే పంథాలోనే వెళ్ళారని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. కాస్త కామెడీ.. కొన్ని డాన్సులు.. ఫుల్ మాస్.. అన్నీ కలిపితే భోళా శంకర్. ముఖ్యంగా చిరు లుక్‌తో పాటు.. కామెడీ కూడా ఈ సినిమాలో హైలైట్ కానుంది. ట్రైలర్‌లో రాజశేఖర్‌ ఇమిటేషన్ సీన్‌తో పాటు.. రామ్ చరణ్, పవన్‌ను కూడా వాడేసారు చిరంజీవి.

వేదాలంకు రీమేక్ అయినా.. చిరు ఇమేజ్‌కు తగ్గట్లు మార్పులు బానే జరిగాయని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తుంది. పైగా ప్రయోగాల జోలికి పోకుండా వింటేజ్ చిరంజీవిని ప్రజెంట్ చేసారు మెహర్. ఆగస్ట్ 11న భోళా శంకర్ విడుదల కానుంది. ఇందులో తమన్నా హీరోయిన్ కాగా.. కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి భోళా శంకర్‌తో అయినా మెహర్ రమేష్ బోణీ కొడతారో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..