అల్లుడు శీను సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు ఈ కుర్ర హీరో. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం దక్కలేదు బెల్లంకొండ శ్రీనివాస్ కు. అయితే రమేష్ వర్మ తెరకెక్కించిన రాక్షసుడు సినిమా ఈ హీరోకి మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా తమిళ్ సినిమాకు రీమేక్. ఇటీవల వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలో ‘ఛత్రపతి’ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్లను వెతుకుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ను సంప్రదించారని గుసగుసలు వినిపించాయి. దాని పైన ఇంతవరకు క్లారిటీ రాలేదు. కాగా ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది.
మరో వైపు తెలుగు లోను లైన్ లో పెట్టనున్నాడు ఈ యంగ్ హీరో. ఇటీవల ధనుష్ నటించిన ‘కర్ణన్’ ను రీమేక్ చేయనున్నాడట. ఇటీవల థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, కోలీవుడ్లో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడట. ‘ఛత్రపతి’ రీమేక్ షూటింగు పూర్తయిన తరువాత ‘కర్ణన్’ రీమేక్ షూటింగ్ మొదలవుతుందట.
మరిన్ని ఇక్కడ చదవండి :