తమిళ్‌లో మంచి విజయం సొంతం చేసుకున్న ‘రాట్షసన్’ తెలుగులో రీమేక్ అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కబోతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో జరిగాయి. రమేశ్ వర్మ తెరకెక్కించబోతున్న ఈ రీమేక్‌లో బెల్లంకొండ సరసన రాశి ఖన్నా నటించనుంది. గిబ్రాన్ సంగీతం అందించనున్న ఈ మూవీని హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మించనున్నారు.
ప్రస్తుతం బెల్లంకొండ, తేజ దర్శకత్వంలో సీతలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అతడి సరసన కాజల్ రెండో సారి జత కడుతుండగా.. సోనూసూద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేయగా.. దాన్ని పూర్తి చేసుకొని రాట్షసన్ రీమేక్‌లో పాల్గొనబోతున్నాడు బెల్లంకొండ. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు నిర్మాతలు.