
Bandla Ganesh: ప్రముఖ నిర్మాత, క్యారెక్టర్ అర్టిస్ట్ బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పరిచయం లేదు. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉండే బండ్ల తనను తాను పవన్ కళ్యాణ్‌కు భక్తుడు అని చెప్పుకుంటుంటాడు. సినిమా ఈవెంట్స్‌లో పవన్‌పై తనకున్న అభిమానాన్ని చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా మరో ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు బండ్ల గణేశ్. మరోసారి పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటి చెప్పాడు బండ్ల.
గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్‌కు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసిన బండ్ల గణేశ్..’నా దైవ సమానులైన మా పవన్ కళ్యాన్ మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బండ్ల గణేశ్’ అని రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే గతంలో బండ్లా గణేశ్ పలుసార్లు పవన్‌తో సినిమా తీయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నారు. ఆయన నటిస్తోన్న పలు చిత్రాల్లో ఇప్పటికే లైన్‌లో ఉన్నాయి. మరి బండ్ల గణేశ్ నిజంగానే పవన్‌తో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడా.? అన్నదానిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
నా దైవ సమానులైన మా @PawanKalyan మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బండ్ల గణేష్ ? pic.twitter.com/OtHMCRIHl1
— BANDLA GANESH. (@ganeshbandla) August 6, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..