Akhanda: ఇది ముమ్మాటికి అఖండ విజయమే.. రికార్డు కలెక్షన్లతో దుమ్ములేపిన బాలయ్య..
Akhanda: కరోనాతో నిశ్చబ్ధంగా మారిన సినిమా థియేటర్లలో సింహ గర్జన చేస్తూ దూసుకొచ్చింది అఖండ చిత్రం. నట సింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కిన అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలకే...
Akhanda: కరోనాతో నిశ్చబ్ధంగా మారిన సినిమా థియేటర్లలో సింహ గర్జన చేస్తూ దూసుకొచ్చింది అఖండ చిత్రం. నట సింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కిన అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఓవర్‌సీస్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టిందీ సినిమా. ఇటీవలి కాలంలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా అరుదైన గుర్తింపును సంపాదించుకుంది. ఏకంగా 103 థియేటర్లలో 50 రోజులు విజయవంతంగా నడిచి రికార్డు సృష్టించిందీ సినిమా.
అఖండ రికార్డు ఇక్కడితో ఆగిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ. 93 కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. నాన్ థియేట్రికల్‌తో కలిసి ఈ సినిమా రూ. 200 క్లబ్‌లో చేరినట్లు చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. నట సింహం బాలకృష్ణ మార్క్ మాస్ డైలాగ్‌లు, యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. చాలా రోజుల తర్వాత సాలిడ్ హిట్ కొట్టిన బాలకృష్ణ ఇండస్ట్రీ దృష్టిని మరోసారి తనవైపు తిప్పుకున్నారు.
ఇలా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంచలన విజయంతో మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచారు బాలయ్య. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా ప్రగ్యాజైస్వాల్ నటించిన విషయం తెలిసిందే. ఇక అఖండ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వేదికగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే.
Also Read: Anasuya Bharadwaj Photos: అందంతో ఆకట్టుకుంటున్న అనసూయ లేటెస్ట్ ఫొటోస్..
Brahmos Supersonic: భారత్ అమ్ములపొదలో మరో వజ్రాయుధం.. బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం..