Balagam Movie: బలగానికి మరో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న భీమ్స్‌..

|

May 01, 2023 | 5:51 PM

బలగం సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమా వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకుందీ మూవీ. కమెడియన్‌ వేణు తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. పెద్దగా స్టారింగ్ లేకున్నా, తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా..

Balagam Movie: బలగానికి మరో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న భీమ్స్‌..
Balagam Movie
Follow us on

బలగం సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమా వచ్చి భారీ విజయాన్ని నమోదు చేసుకుందీ మూవీ. కమెడియన్‌ వేణు తొలిసారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. పెద్దగా స్టారింగ్ లేకున్నా, తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లకుపైగా రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలంగాణ పల్లెల్లో ఉండే సంప్రదాయాలు, పట్టింపులు, గొడవలు, బంధాలు, అనుబంధాలను అద్భుతంగా చూపించిన ఈ సినిమాకు ప్రాంతంతో సంబంధం లేకుండా ఆడియన్స్‌ కనెక్ట్‌ అయ్యారు.

ఇక ఈ సినిమా కేవలం కలెక్షన్లకు మాత్రమే పరిమితం కాకుండా అవార్డుల విషయంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఈ సినిమాకు ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకొని తెలుగు సినిమా స్థాయి సత్తా చాటింది. ఇప్పటి వరకు సుమారు 40 అంతర్జాతీయ అవార్డులను అందుకున్న బలగానికి తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. సినిమా సంగీత దర్శకుడు భీమస్‌ సెసిరోలెకు ఈ ఏడాది జరుగుతున్న 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు లభించింది.

ఇవి కూడా చదవండి

81 దేశాలు నుంచి 780 మంది పోటీ చేయగా భీమ్స్‌కు బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అవార్డు రావడం విశేషం. ఇదిలా ఉంటే బలగం సినిమా విజయంలో పాటలకు కూడా ముఖ్యపాత్ర పోషిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథలోని ఎమోషన్‌కు సంగీతం తోడవడంతో ఆడియన్స్‌ తెగ కనెక్ట్‌ అయ్యారు. ఇక బలగం మూవీని మరిన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్‌తో పాటు ఆస్కార్‌కి కూడా పంపిస్తామని చిత్ర నిర్మాత దిల్‌రాజు తెలిపారు. మరి బలగం మరెన్ని అవార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..