- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna Confirms Son Mokshagna's Tollywood Entry In 2023 Know Who is The Director Telugu Film News
Nandamuri Mokshagna: బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ.. దర్శకుడు ఎవరంటే..?
నందమూరి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అన్నగారి వారసులుగా వారికి ఆ గుర్తింపు గౌరవం ఉంటుంది. అటు బాలయ్య, చిన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్... సినిమా ఇండస్ట్రీలో ప్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు.
Updated on: May 01, 2023 | 6:19 PM

నటసింహం బాలయ్య తనయుడు మోక్షజ్ఞను సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూస్తామా అని నందమూరి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞకు యాక్టింగ్‌పై ఇంట్రస్ట్ లేదని వార్తలు రావడంతో అభిమానులు నొచ్చుకున్నారు. ఆ తర్వాత అవి రూమర్స్ మాత్రమే అని క్లారిటీ వచ్చింది.

తాజాగా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ఓ అదిరిపోయే న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. త్వరలోనే ఈ నందమూరి నటవారసుడి వెండితెరపై అలరించబోతున్నట్లు తెలుస్తోంది.

బాలయ్యతో సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చి.. మాస్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను మోక్షజ్ఞను లాంచ్ చేయనున్నారట. ఇందుకు సంబంధించి కథాచర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం.

బోయపాటి ప్రజంట్ రామ్ పోతినేనితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బాలకృష్ణతో సినిమా ఉంటుందని తెలిసింది. అందులోనే మోక్షజ్ఞ కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది.

సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో మోక్షజ్ఞ కనిపిస్తారట. గెస్ట్ రోల్‌లో కనిపించినప్పటికీ.. అది సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. ఆఫీషియల్‌గా కన్ఫామ్ చేయనప్పటికీ ఈ వార్త నిజమేనని ఫిల్మ్ నగర్‌లో టాక్ నడుస్తుంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.




