AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రోజు హీరో వెంకటేష్ లేకపోతే అయిపోయేవాడిని.. నా ప్రాణాలు కాపాడారు

చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగ ప్రవేశం.. స్టార్ హీరోలతో కలిసి నటన.. హీరోగా మారినా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయిన నటుడు బాలాదిత్య. అయితే ఓ సినిమా షూటింగ్‌లో తన ప్రాణాలను వెంకటేష్ ఎలా కాపాడారో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. 

ఆ రోజు హీరో వెంకటేష్ లేకపోతే అయిపోయేవాడిని.. నా ప్రాణాలు కాపాడారు
Venkatesh
Rajeev Rayala
|

Updated on: Sep 14, 2026 | 1:29 PM

Share

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటులు బాలనటులుగా తమ కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్‌లుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతమంది మాత్రం క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. అలాంటి వారిలో నటుడు బాలాదిత్య కూడా ఒకరు. బాలనటుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన, ఆ తర్వాత హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాలాదిత్య 1991లో, తన ఆరవ ఏట ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’ సినిమాతో బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు తొలి క్లాప్ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Hanuman Ansh: చాలా డబ్బులు వచ్చాయి.. వాటిని ఏం చేసుకోవాలో అర్ధంకావడంలేదు..: హనుమాన్ అంశ్ నిర్మాత

తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్య, ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోలతో కలిసి పనిచేసే అవకాశం ఆయనకు దక్కింది. బాలనటుడిగా తన ప్రతిభతో మెప్పించిన ఆయనకు పరిశ్రమలో మంచి పేరు వచ్చింది. బాలనటుడిగా సుదీర్ఘ ప్రయాణం చేసిన బాలాదిత్య, ఆ తర్వాత హీరోగా కూడా సినిమాలు చేశారు. అయితే హీరోగా ఆయనకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. దీంతో క్రమంగా ఇతర పాత్రల వైపు దృష్టి సారించారు. సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. మూడు దశాబ్దాలకు పైగా సినీ, టెలివిజన్ రంగాల్లో కొనసాగుతున్న బాలాదిత్యకు ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన రోజుల గురించి ఆయన గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

వారణాసిపై పృథ్వీరాజ్ కామెంట్స్‌.. టైమ్ ట్రావెల్ మూవీ కాదు.. అంతకు మించి ఉంటుందట

బాలాదిత్య కెరీర్‌లో మర్చిపోలేని సంఘటనల్లో ‘సూపర్ పోలీస్’ సినిమా షూటింగ్‌లో జరిగిన ఘటన ఒకటి. వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కే. మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి బాలాదిత్య గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. బాలాదిత్య చెప్పిన వివరాల ప్రకారం.. సినిమాలోని ఓ సన్నివేశంలో తాను చితికి నిప్పు పెట్టాల్సి ఉందట. అయితే ఆ సమయంలో మంట అంటుకోకపోవడంతో అక్కడే ఉన్న సిబ్బందిలో ఒకరు చితిపై పెట్రోల్ పోశారట. ఆ క్రమంలో పెట్రోల్ తనపై పడే ప్రమాదం ఏర్పడిందని బాలాదిత్య గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వెంకటేష్ పరిస్థితిని వెంటనే గమనించి, బాలాదిత్యను పక్కకు లాగి కాపాడారట. వెంకటేష్ సమయస్ఫూర్తితో వ్యవహరించకపోయి ఉంటే పెట్రోల్ తనపై పడి మంటలు అంటుకునే ప్రమాదం ఉండేదని బాలాదిత్య తెలిపారు. తన ప్రాణాలను కాపాడిన ఆ సంఘటనను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వారణాసిపై పృథ్వీరాజ్ కామెంట్స్‌.. టైమ్ ట్రావెల్ మూవీ కాదు.. అంతకు మించి ఉంటుందట

Venkatesh

Venkatesh

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us