AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ 10 నిమిషాలు ఇస్త్రీ చేస్తే కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసా..?

ఐరన్ బాక్స్ ఆన్ చేస్తే చాలు.. కరెంట్ మీటర్ రాకెట్ వేగంతో తిరుగుతుంది.. బిల్లు మోత మోగిపోతుంది.. దాదాపు ప్రతి ఇంట్లో వినిపించే మాటే ఇది. ఎక్కడిక్కైన వెళ్లే ముందు రోజూ ఓ 10 నిమిషాలు బట్టలు ఇస్త్రీ చేస్తున్నారా? అయితే ఆ కాసేపటి అలవాటు మీ జేబుకు నిజంగానే చిల్లు పెడుతోందా? అసలు ఐరన్ బాక్స్ నెలకు ఎన్ని యూనిట్లు కాలుస్తుంది? దీని వెనుక ఉన్న అసలు మీటర్ లెక్కలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోజూ 10 నిమిషాలు ఇస్త్రీ చేస్తే కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసా..?
Iron Box Power Consumption
Krishna S
|

Updated on: Sep 14, 2026 | 1:15 PM

Share

ఆఫీసుకో, కాలేజీకో వెళ్లే ముందు స్నానం చేసి చకచకా ఓ పది నిమిషాలు బట్టలు ఇస్త్రీ చేసుకోవడం చాలామందికి రోజూ అలవాటు. అయితే నెల చివర్లో కరెంట్ బిల్లు భారీగా రాగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఇంట్లోని ఐరన్ బాక్సే. ‘‘అమ్మో.. ఐరన్ బాక్స్ ఆన్ చేస్తే మీటర్ రాకెట్‌లా తిరుగుతుంది.. అందుకే బిల్లు తడిసి మోపెడవుతోంది’’ అనుకోవడం దాదాపు ప్రతి మధ్యతరగతి ఇంట్లో కనిపించే కామన్ సీన్. కానీ నిజంగానే రోజూ 10 నిమిషాలు ఇస్త్రీ చేస్తే భారీగా విద్యుత్ ఖర్చవుతుందా? సైన్స్, యూనిట్ కొలతల లెక్కలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం.

యూనిట్ల లెక్క తేలిందిలా

ఇళ్లలో సాధారణంగా డ్రై ఐరన్ (1000 వాట్స్), స్టీమ్ ఐరన్ (1500 వాట్స్) వాడుతుంటారు. ఒక వ్యక్తి రోజుకు సగటున 10 నిమిషాల చొప్పున నెలకు వాడితే మొత్తం వినియోగ సమయం 300 నిమిషాలు, అంటే కేవలం 5 గంటలు మాత్రమే.

  • డ్రై ఐరన్ బాక్స్ (1000W) – నెలకు కేవలం 5 యూనిట్లు మాత్రమే
  • స్టీమ్ ఐరన్ బాక్స్ (1500W): నెలకు కేవలం 7.5 యూనిట్లు మాత్రమే.

పైగా ఆధునిక ఐరన్ బాక్సుల్లో ఆటోమేటిక్ థర్మోస్టాట్ సెన్సార్లు ఉంటాయి. అవి నిర్దేశిత వేడికి చేరుకోగానే విద్యుత్ సరఫరాను ఆటోమేటిక్‌గా ఆపేస్తాయి. కాబట్టి వాస్తవ వినియోగం పై లెక్క కంటే ఇంకా తక్కువగానే ఉంటుంది.

ఖర్చు ఎంతవుతుంది?

విద్యుత్ టారిఫ్ శ్లాబుల ప్రకారం చూస్తే..

నెలకు 100 యూనిట్ల లోపు వాడే కుటుంబాలకు: డ్రై ఐరన్ వాడితే నెలకు కేవలం రూ. 25, స్టీమ్ ఐరన్ వాడితే దాదాపు రూ. 40 లోపే ఖర్చవుతుంది.

100 నుంచి 300 యూనిట్లు వాడే కుటుంబాలకు: డ్రై ఐరన్‌కు సుమారు రూ. 50 నుంచి రూ. 55 కాగా, స్టీమ్ ఐరన్‌కు రూ. 80 నుంచి రూ. 85 వరకు అదనపు భారం పడుతుంది.

అంటే రోజంతా కష్టపడి ఇస్త్రీ చేసుకున్నా అయ్యే ఖర్చు నెలకు ఒక కప్పు టీ లేదా చిన్న స్నాక్ ఖర్చుతో సమానం.

అసలు విలన్లు వీరే..

కరెంట్ బిల్లు మోత మోగడానికి ఐరన్ బాక్స్ కారణం కాదు. రాత్రంతా నిరంతరాయంగా నడిచే ఎయిర్ కండిషనర్లు, స్నానం కోసం గంటల తరబడి ఆన్‌లో ఉంచే వాటర్ గీజర్లు, నిరంతరం పనిచేసే పాత రిఫ్రిజిరేటర్లు, పాతకాలపు సీలింగ్ ఫ్యాన్లే అసలు విద్యుత్ రాబందులని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

విద్యుత్ ఆదా చేసే స్మార్ట్ టిప్

రోజూ పది నిమిషాలు ఐరన్ చేయడం వల్ల ప్రారంభంలో అది వేడెక్కడానికి కొంత విద్యుత్ వృథా అవుతుంది. అలా కాకుండా వారానికి సరిపడా బట్టలను ఒకేసారి వరుసగా ఇస్త్రీ చేసుకుంటే, ఐరన్ బాక్స్ స్థిరమైన వేడితో ఉండి విద్యుత్ వినియోగం మరో 25శాతం నుంచి 30శాతం వరకు ఆదా అవుతుంది. కాబట్టి రోజూ ఇస్త్రీ చేస్తే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే భయం పూర్తిగా అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.

Follow Us