AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

150 ఏళ్లు బతకాలనుకున్న మైఖేల్ జాక్సన్.. కానీ 50 ఏళ్లకే మృత్యువు! చివరి రోజుల్లో ఏం జరిగింది?

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ‘కింగ్ ఆఫ్ పాప్’ మైకల్ జాక్సన్ జీవితం ఎప్పుడూ ఆసక్తికరమే. ఆయన పాటలు, డ్యాన్స్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, చికిత్సలు, ప్లాస్టిక్ సర్జరీలు కూడా ఎన్నో ఏళ్లుగా చర్చనీయాంశంగా ఉన్నాయి. ముఖ్యంగా మైకల్ జాక్సన్ 150 ఏళ్ల వరకు జీవించాలని ప్రయత్నించాడనే కథనం ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

150 ఏళ్లు బతకాలనుకున్న మైఖేల్ జాక్సన్.. కానీ 50 ఏళ్లకే మృత్యువు! చివరి రోజుల్లో ఏం జరిగింది?
King Of Pop Michael Jackson
Srilakshmi C
|

Updated on: Sep 14, 2026 | 1:28 PM

Share

ఎక్కువ కాలం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండేందుకు మైకల్ జాక్సన్ తన ఆరోగ్యంపై విపరీతమైన శ్రద్ధ పెట్టేవాడని చెబుతారు. ఆయన చుట్టూ పలువురు వైద్యులు, ట్రైనర్లు ఉండేవారని, ఆహారం నుంచి వ్యాయామం వరకు ప్రతి విషయాన్ని నిపుణుల పర్యవేక్షణలో చేసేవాడని ప్రచారం జరిగింది. అయితే ఈ కథనాల్లోని చాలా వివరాలకు విశ్వసనీయ ఆధారాలు లేవు. 150 ఏళ్లు జీవించాలనే లక్ష్యంతో ఆయన భారీ వైద్య బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడనే విషయం ప్రధానంగా పాత వార్తా కథనాలు, ఇంటర్నెట్‌లో నేటికీ చర్చణీయాంశంగా ఉన్నాయి.

ఆక్సిజన్ చాంబర్ కథ ఎలా మొదలైంది?

మైకల్ జాక్సన్‌కు సంబంధించిన అత్యంత ప్రసిద్ధ కథనాల్లో హైపర్‌బారిక్ ఆక్సిజన్ చాంబర్ ఒకటి. 1986లో ఆయన హైపర్‌బారిక్ చాంబర్‌లో ఉన్న ఫొటో ఒకటి మీడియాలో ప్రచురితమైంది. ఆ తర్వాత ఆయన వయసు పెరగకుండా ఉండేందుకు ఈ చాంబర్‌లో నిద్రపోతున్నారని, దీని ద్వారా 150 ఏళ్ల వరకు జీవించాలని భావిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అప్పటి వైద్య నిపుణులు మాత్రం హైపర్‌బారిక్ చాంబర్ మనిషి జీవితకాలాన్ని 100 లేదా 150 ఏళ్లకు పెంచుతుందని ఎలాంటి వైద్య ఆధారం లేదని స్పష్టం చేశారు. హైపర్‌బారిక్ ఆక్సిజన్ థెరపీకి కొన్ని నిర్దిష్ట వైద్య ఉపయోగాలు ఉన్నప్పటికీ, జీవితకాలాన్ని పెంచడం దాని నిరూపిత ప్రయోజనం కాదు. మైకల్ జాక్సన్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఆయన ఆహారం, వ్యాయామం, నిద్ర వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాడు. ఆయనకు సంబంధించిన మరో ప్రచారంలో.. శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండేలా వైద్యుల సలహాలు తీసుకునేవాడని, భవిష్యత్తులో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ముందుగానే సిద్ధంగా ఉండాలని ప్రయత్నించేవాడని పేర్కొన్నారు.

మారిపోయిన చర్మం.. విటిలిగో

మైకల్ జాక్సన్ రూపంలో వచ్చిన మార్పుల్లో అతని చర్మం రంగు మారడం అత్యంత చర్చనీయాంశంగా మారింది. మొదట్లో ఆయన చర్మం ముదురు నలుపు రంగులో ఉండేది. ఆ తర్వాత క్రమంగా ఆయన చర్మం చాలా తెల్లగా కనిపించడం ప్రారంభించింది. దీనిపై ఎన్నో ఊహాగానాలు వచ్చినప్పటికీ, మైకల్ జాక్సన్‌కు విటిలిగో అనే చర్మవ్యాధితో బాధపడుతున్నట్లు మరణం అనంతరం పోస్టుమార్టంలో వెల్లడైంది. ఈ వ్యాధితో చర్మంలోని కొన్ని ప్రాంతాల్లో రంగు కోల్పోయి తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అతని చర్మంలో వచ్చిన ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. మైకల్ జాక్సన్ తన రూపంలో కూడా పలు మార్పులు చేసుకున్నాడు. ముఖ్యంగా ముక్కుకు రైనోప్లాస్టీ చేయించుకున్న విషయం ఆయన స్వయంగా వెల్లడించిన విషయాల్లో ఒకటి. తన ఆటోబయోగ్రఫీ, 1993 ఇంటర్వ్యూలో ఆయన రెండు రైనోప్లాస్టీ శస్త్రచికిత్సల గురించి పేర్కొన్నట్లు రికార్డులు ఉన్నాయి. ఆయన ముఖ ఆకృతిలో వచ్చిన మార్పులు కూడా అభిమానులు, మీడియాకు ఎప్పటికప్పుడు చర్చకు కారణమయ్యాయి.

ఇవి కూడా చదవండి

150 ఏళ్ల కల.. 50 ఏళ్లకే ముగిసిన జీవితం

ఎంత జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నించినప్పటికీ మైకల్ జాక్సన్ జీవితం అనూహ్యంగా ముగిసింది. 2009 జూన్ 25న, 50 ఏళ్ల వయసులో మైకల్ జాక్సన్ మరణించాడు. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కాన్రాడ్ ముర్రేకు సంబంధించిన ప్రొపోఫోల్ వినియోగం ఈ మరణ కేసులో కీలక అంశంగా మారింది. దీంతో 150 ఏళ్ల వరకు జీవించాలనే మైకల్ జాక్సన్‌కు ఆపాదించబడిన ఆశయం నెరవేరకుండానే ఆయన జీవితం ముగిసింది.

ప్రపంచాన్ని కుదిపేసిన మైకల్ జాక్సన్ మరణం

మైకల్ జాక్సన్ మరణ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు వీక్షించారు. ఆయన మరణం తర్వాత కూడా మైకల్ జాక్సన్ ఆరోగ్యం, జీవనశైలి, చికిత్సలు, వ్యక్తిగత జీవితం గురించి అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. మైకల్ జాక్సన్ 150 ఏళ్లు జీవించేందుకు 12 మంది డాక్టర్లు, 15 మంది ట్రైనర్లు, అవయవ దాత కుటుంబాలను సిద్ధంగా ఉంచుకున్నాడనే కథనాలు ఎక్కువగా నెట్టింట వైరల్ కథనాలే. అయితే ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం, హైపర్‌బారిక్ ఆక్సిజన్ చాంబర్‌కు సంబంధించిన 1986 ఘటన, ప్లాస్టిక్ సర్జరీలు, విటిలిగో వంటి అంశాలు మాత్రం ఆయన జీవితంలో నిజంగా నమోదైన విషయాలతో ముడిపడి ఉన్నాయి.

Follow Us