Lata Mangeshkar: లతాజీ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆశా భోస్లే.. దీదీ ఆరోగ్య పరిస్థతిపై ఏం చెప్పారంటే..

|

Feb 06, 2022 | 6:52 AM

కొవిడ్‌ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ (Lata Mangeshkar) ఆరోగ్యం శనివారం మళ్లీ క్షీణించిన సంగతి తెలిసిందే.

Lata Mangeshkar: లతాజీ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆశా భోస్లే.. దీదీ ఆరోగ్య పరిస్థతిపై ఏం చెప్పారంటే..
Lata Mangeshkar
Follow us on

కొవిడ్‌ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ (Lata Mangeshkar) ఆరోగ్యం శనివారం మళ్లీ క్షీణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ముంబయి (Mumbai) బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ ప్రతీత్‌ సంధాని తెలిపారు. ప్రస్తుతం గాయని ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారని.. చికిత్సకు స్పందిస్తోందని డాక్టర్‌ చెప్పుకొచ్చారు. కాగా లతాజీ ఆరోగ్యం విషమించిందని తెలియగానే ఆమె సోదరి, ప్రముఖ గాయని ఆశా భోస్లే (Asha Bhosle) హుటాహుటిన బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చేరుకున్నారు. దీదీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ‘దీదీ తొందరగా కోలుకోవాలని మేమందరం ప్రార్థనలు చేస్తున్నాం. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోందని, చికిత్సకు స్పందిస్తోందని వైద్యులు తెలిపారు’ అని ఆశా చెప్పుకొచ్చారు.

కరోనాతో పాటు న్యుమోనియా బారిన పడిన లతాజీని ఆమె కుటుంబ సభ్యులు జనవరి 11న ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. డాక్టర్ ప్రతీత్ సంధాని నేతృత్వంలోని ప్రత్యేక వైద్యుల బృందం ఆమెకు వైద్యం అందిస్తోంది. కాగా గత నెల చివరిలో లెజెండరీ సింగర్‌ ఆరోగ్యం మెరుగుపడుతోందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే ప్రకటించారు. కొవిడ్‌ తో పాటు న్యుమోనియా నుంచి ఆమె కోలుకున్నారని తెలియజేశారు. అయితే శనివారం మధ్యాహ్నం మళ్లీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో పాటు హాస్పిటల్‌ పరిసరాల్లో పోలీసులు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

Also Read:Khiladi: క్యాచ్ మీ పాటకు అదిరిపోయే రెస్పాన్స్.. రవితేజ ఖిలాడిని పట్టుకోవడం కష్టమే..

IDRBT Recruitment: హైదరాబాద్‌ ఐడీఆర్‌బీటీలో ఉద్యోగాలు.. బీటెక్‌ చేసిన అర్హులు.. ఎలా ఎంపిక చేస్తారంటే..

Gold, Silver Price Today: గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. తాజా ధరల వివరాలు