AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asha Bhosle: ఇండియాలో రిచెస్ట్ సింగర్స్ లో ఒకరు.. ఆశా భోంస్లేకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

దిగ్గజ గాయని ఆశా భోంస్లే ఈరోజు (ఏప్రిల్ 12) కన్నుమూశారు. హిందీ, తెలుగు, కన్నడతో సహా పలు భాషల్లో వేలాది పాటలు పాడారామె. సుమారు 80 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమకు సేవలందించారీ లెజెండరీ సింగర్. ఇప్పుడీ గానం మూగబోయిన నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందా రండి.

Asha Bhosle: ఇండియాలో రిచెస్ట్ సింగర్స్ లో ఒకరు.. ఆశా భోంస్లేకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
Asha Bhosle
Basha Shek
|

Updated on: Apr 12, 2026 | 5:25 PM

Share

బాలీవుడ్ దిగ్గజ గాయని ఆశా భోంస్లే 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణాలతో శనివారం (ఏప్రిల్ 11) ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె ఆదివారం (ఏప్రిల్ 12) తుది శ్వాస విడిచారు. ఈ వార్త బయటకు రాగానే బాలీవుడ్ సినిమా పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మెగాస్టార్ చిరంజీవి తదితర సినీ, రాజకీయ ప్రముఖులు గాన కోకిలకు నివాళి అర్పిస్తున్నారు. మరోవైపు సంగీతాభిమానులు ఆశా పాడిన పాటలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలో జన్మింంచారు ఆశా భోస్లే. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నటుడు, అలాగే గాయకుడు కూడా. తల్లి శివార్తాయ్ మంగేష్కర్ ఓ సాధారణ గృహిణి. కాగా ఆశా భోంస్లే తన వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంది. కుటుంబీకుల అభీష్టానికి చిన్న వయసులోనే ప్రేమ వివాహం చేసుకుంది. ఈ కారణంగానే చాలా ఏళ్ల పాటు లతా మంగేష్కర్ ఆశాను దూరం పెట్టారనే ప్రచారం ఉంది. ఇక ఆశా కుమార్తె వర్ష (పాత్రికేయురాలు) ఆత్మహత్య చేసుకోగా, కుమారుడు హేమంత్ భోంస్లే క్యాన్సర్‌తో మరణించారు. ఆమె రెండవ కుమారుడు పేరు ఆనంద్ భోంస్లే కాగా మనవరాలు జానై భోంస్లే కూడా గాయనిగా రాణిస్తోంది.

కాగా ఆశా భోంస్లే 1943లో మరాఠీ పాటలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హిందీ, తెలుగుతో పాటు వివిధ భాషల్లోనూవేలాది పాటలు పాడారు. ఆమె పాటలు ఎన్నో దశాబ్దాలుగా సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇక మీడియా నివేదికల ప్రకారం, ఆశా భోంస్లే నికర ఆస్తి విలువ సుమారు రూ. 80 నుంచి 100 కోట్ల మధ్య ఉంది. అలాగే ఆమె పేరిట 12000కు పైగా పాటలు, అంతర్జాతీయ ప్రదర్శనలు,రాయల్టీ ఆదాయం ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోడీతో ఆశా భోంస్లే..

ఆశా భోస్లే చాలా మంచి వంట మనిషి కూడా.  ఈక్రమంలోనే ‘ఆశాస్’ అనే పేరుతో ఒక రెస్టారెంట్ చైన్‌ను కూడా ప్రారంభించారు, దీనికి దుబాయ్, కువైట్ మరియు అనేక ఇతర ప్రదేశాలలో 15కు పైగా శాఖలు ఉన్నాయి. ఆశా తన గాన ప్రతిభకు సూచీకగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఆమె రెండు జాతీయ అవార్డులు, జీవిత సాఫల్య పురస్కారంతో సహా 10 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 17 మహారాష్ట్ర రాష్ట్ర అవార్డులు, ఇంకా అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు. ఆమె పద్మవిభూషణ్, మహారాష్ట్ర భూషణ్, గ్రామీ జీవిత సాఫల్య పురస్కారం ఇంకా మరెన్నో గౌరవాలను అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us