ఆ బాధ నాకు తెలుసు.. అందుకే వారికి దగ్గరయ్యా..!
అతిలోక సుందరి శ్రీదేవీ మరణం తరువాత ఆమె కుమార్తెలకు బోని కపూర్ మొదటి భార్య కుమారుడు, కుమార్తె అర్జున్ కపూర్, అన్షులా కపూర్‌లు అండగా నిలిచిన విషయం తెలిసిందే.

అతిలోక సుందరి శ్రీదేవీ మరణం తరువాత ఆమె కుమార్తెలకు బోని కపూర్ మొదటి భార్య కుమారుడు, కుమార్తె అర్జున్ కపూర్, అన్షులా కపూర్‌లు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సోదరుడిగా జాన్వీ, ఖుషీల బాధ్యతలను తీసుకున్న అర్జున్.. సోషల్ మీడియాలో వారిపై వస్తున్న రూమర్లను ఖండిస్తూ ఉంటారు. అంతేకాదు అర్జున్, జాన్వి ఇద్దరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండగా.. ఆమెకు పలు సూచనలు కూడా చేస్తుంటారు. కాగా శ్రీదేవి మరణం తరువాత తన చెల్లెళ్లకు మద్దతుగా నిలవడంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
నేను మంచి మనిషిలా ఉండాలని మా అమ్మ నాకు చెప్పింది. ఇతరులతో సౌమ్యంగా ఉండాలని విలువలు నేర్పింది. పరిస్థితులను బట్టి నేను ప్రవర్తిస్తుంటా. అందుకే నా తండ్రికి ఎలాంటి సాయం చేయగలనో, అదే చేస్తున్నా. శ్రీదేవి మరణం తరువాత జాన్వి, ఖుషీలను కలిసి, వారి గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. నా జీవితంలో ఎన్నో బాధలను అనుభవించా. వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నా. మా అమ్మ చనిపోయిన సమయంలో నన్ను ఓదార్చే వారు ఎవరైనా నా పక్కనుంటే బావుండేది అనిపించింది. జాన్వి, ఖుషీలకు అలాంటి పరిస్థితినే ఎదురైంది. అందుకే నాకు తెలిసిన సాయం చేస్తున్నా అని అర్జున్ కపూర్ అన్నారు.
Read This Story Also: సీఎం జగన్ ఆదేశాలు.. ఫైన్ లేకుండానే వాహనాలకు విముక్తి..!



