బిగ్‌బాస్ బ్యూటీ సంతోషం… త‌న జీవితంలో ఓ మంచి రోజు నేడు అంటూ పోస్ట్‌… ఎందుకో తెలుసా…

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4 కంటెస్టెంట్ అరియానా సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. జీవితంలో ఈ రోజు మంచి రోజు అంటూ...

బిగ్‌బాస్ బ్యూటీ సంతోషం... త‌న జీవితంలో ఓ మంచి రోజు నేడు అంటూ పోస్ట్‌... ఎందుకో తెలుసా...

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4 కంటెస్టెంట్ అరియానా సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. జీవితంలో ఈ రోజు మంచి రోజు అంటూ ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. అయితే ఆమె సంతోషానికి కార‌ణం ఎంటంటే..?

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌…

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 4లో త‌న వ్య‌క్తిత్వం, పోరాట స్ఫూర్తితో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకుని టాప్ 5లో నిలిచింది యాంక‌ర్ అరియానా. అయితే చాలా కాలంగా యాంక‌రింగ్ ఫీల్డ్‌లో ఉన్నా ఆమెకు స‌రైన గుర్తింపు రాలేదు. కానీ, ఆర్జీవీ ఇంట‌ర్వ్యూతో అరియానా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అక్క‌డ నుంచి బిగ్‌బాస్ ఆఫ‌ర్‌, ఆ త‌ర్వాత అంద‌రికి తెలిసిందే. అరియానాకు తెలుగు ప్ర‌జ‌ల్లో గుర్తింపు ద‌క్కింది. అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డికి సినిమా అవ‌కాశం వ‌చ్చిన‌ట్లుంది. అందుకు సంబంధించిన ఓ చిన్న హింట్‌ను అరియానా త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఇచ్చింది.

ఏం రాసిందంటే…

హీరో రాజ్ త‌రుణ్, ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గ‌విరెడ్డి(సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు ఫేమ్)తో దిగిన ఫొటోని షేర్ చేస్తూ.. అతి త్వ‌ర‌లో ఎగ్జైటింగ్ వార్త రానుందని రాసింది. అంతే కాకుండా బిగ్ బాస్ త‌ర్వాత నా జీవితంలో ఓ మంచి రోజని పేర్కొంది. అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గ‌విరెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతూ రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్ అని కామెంట్ పెట్టింది. అలానే అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌ ‌ని హ్యాష్ ట్యాగ్‌తో జ‌త చేసింది. సో… అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న అరియానా ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu