Veera simha reddy: రాజకీయ వీరసింహా రెడ్డి.. బాలయ్య పలికిన ఈ డైలాగ్స్‌ వైసీపీనీ టార్గెట్ చేసినవేనా.? ఇప్పుడిదే చర్చ..

అభిమానులు ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న వీరసింహా రెడ్డి సినిమా థియేటర్లకు వచ్చేసింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌ షోతోనే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం 5 షోలకు అనుమతి ఇవ్వడంతో హైదరాబాద్‌లో వీరసింహా రెడ్డి హంగామా ఉదయం నుంచే ప్రారంభమైంది. అంతా బాగానే ఉన్నా..

Veera simha reddy: రాజకీయ వీరసింహా రెడ్డి.. బాలయ్య పలికిన ఈ డైలాగ్స్‌ వైసీపీనీ టార్గెట్ చేసినవేనా.? ఇప్పుడిదే చర్చ..
Veera Simha Reddy
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 12, 2023 | 11:25 AM

అభిమానులు ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న వీరసింహా రెడ్డి సినిమా థియేటర్లకు వచ్చేసింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌ షోతోనే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం 5 షోలకు అనుమతి ఇవ్వడంతో హైదరాబాద్‌లో వీరసింహా రెడ్డి హంగామా ఉదయం నుంచే ప్రారంభమైంది. అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు చేరుకుంటున్నారు. అఖండ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మూవీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉందని ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. బాలకృష్ణ పవర్‌ఫుల్ యాక్టింగ్‌, థమన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఈ సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టిందని చెబుతున్నారు. ఇక థియేటర్ల వద్ద అభిమానుల సందడికి హద్దే లేకుండా పోతోంది. ఫుల్‌ జోష్‌లో ఖుషీ చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడీ ఈ సినిమా సరికొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ సినిమాలో బాలయ్య పలికిన కొన్ని డైలాగ్‌లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీశాయి. వీరసింహా రెడ్డి సినిమాలో బాలకృష్ణ చెప్పిన కొన్ని డైలాగ్‌లు వైసీపీ టార్గెట్‌ చేసినట్లు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రభుత్వంపై ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్‌ చేశారంటూ చర్చ జరుడుతోంది. ముఖ్యంగా.. ‘సంతకం పెడితే బోర్డుపై పేరు మారొచ్చేమోగాని… చరిత్ర సృష్టించినవారి పేరు మారదు,.. మార్చలేరు …కోస్తా నాకొడకా’. ‘పదవి చూసుకుని నీకు పొగరేమే..బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువ’. ‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్… నా జీవో గాడ్స్ ఆర్డర్’. ‘ప్రగతి సాధించడం అబివృద్ది-ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ది- భిచ్చమేయడం కాదు. అభివృద్ధి పనులు ఆపడం అభివృద్ది కాదు. నిర్మించడం అభివృద్ది, కూల్చడం కాదు.. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ది-ఉన్న పరిశ్రమలు మూసివేయడం అబివృద్ది కాదు’ అనే డైలాగ్‌లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ వ్యవహారంపై అటు వైపు నుంచి ఏమైనా కౌంటర్‌ అటాక్‌ వస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే వీరసింహారెడ్డి సందడి అమెరికాకు సైతం వ్యాపించింది. అక్కడ బాలయ్య ఫ్యాన్స్‌ చేసిన పనికి ఏకంగా పోలీసులే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికాలో వీరసింహారెడ్డి సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపివేశారు. వర్జీనియాలో వీరసింహా రెడ్డి సినిమా ఆడుతోన్న ఓ థియేటర్‌లో అభిమానులు పేపర్లు చించి హడావిడి చేశారు. దీంతో పోలీసులు అర్ధాంతరంగా షో నిలిపివేశారు. థియేటర్‌లో ఫ్యాన్స్ హంగామాను అడ్డుకున్నారు. థియేటర్‌లో ఇలాంటివి అంగీకరించేదిలేదంటూ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..