AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Lokesh: అందరిలాగే నేనూ ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. నారా లోకేశ్ ట్వీట్ వైరల్

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇటీవల రణబాలి చిత్రం ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. విజయ్, రష్మికల సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షించారు. తాజాగా మరో తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపించారు లోకేశ్. సాధారణ ప్రేక్షకుల్లాగానే తాను ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

Nara Lokesh: అందరిలాగే నేనూ ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. నారా లోకేశ్  ట్వీట్ వైరల్
Nara Lokesh
Basha Shek
|

Updated on: Oct 11, 2026 | 11:15 AM

Share

తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మీ’. ఉత్తరాంధ్ర జానపద కళారూపమైన బుర్రకథకు ప్రాణం పోసిన దిగ్గజ కళాకారిణి రెడ్డి విజయలక్ష్మి (గరివిడి లక్ష్మి) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెకకించారు. పీపుల్స్ మీడియా పతాకంపై టి.జి. విశ్వప్రసాద్‌, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. గరివిడి లక్ష్మీగా ఆనంది నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ రాశి మరో కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు నరేశ్, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, కంచరపాలెం కిషోర్, కుశాలిని తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు, ట్రైలర్ సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి గరివిడి లక్ష్మి సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేశారు. సాధారణ ప్రేక్షకుల్లాగే తాను కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

‘సోష‌ల్ మీడియాలో హోరెత్తిపోతున్న గ‌రివిడి ల‌క్ష్మి సినిమా పాట‌లు, టీజ‌ర్‌ నాలో ఆస‌క్తి రేపాయి. ఎవ‌రీ గ‌రివిడి ల‌క్ష్మి, ఏంటా క‌థ అని ఆరా తీశాను. ఊరు పేరునే ఇంటి పేరుగా, బుర్ర‌క‌థ‌నే జీవితంగా బ‌తికి, క‌ళ‌ని బ‌తికించిన రెడ్డి విజ‌య‌ల‌క్ష్మి యథార్థ గాథ ఆధారంగా గ‌రివిడి ల‌క్ష్మి సినిమా తెర‌కెక్కుతోంద‌ని తెలిసింది. చ‌దువుకోక‌పోయినా సాంప్ర‌దాయ బుర్ర‌క‌థ శైలికి ఉత్త‌రాంధ్ర జాన‌ప‌దాలు, ప‌ల్లెప‌దాలు జోడించి బుర్ర‌క‌థ క‌ళ‌కే వ‌న్నెతెచ్చిన గ‌రివిడి ల‌క్ష్మి సినిమా విడుద‌ల కోసం ప్రేక్ష‌కుల మాదిరిగానే నేనూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కోసం ప‌నిచేసిన క‌ళాకారులంద‌రికీ ముందుగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు లోకేశ్.

ఇవి కూడా చదవండి

నారా లోకేష్ ట్వీట్..

గ‌రివిడి ల‌క్ష్మి సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
విద్యార్థి గుండుపై తబలా వాయిస్తూ వెకిలి చేష్టలు.. టీచర్ సస్పెండ్!
విద్యార్థి గుండుపై తబలా వాయిస్తూ వెకిలి చేష్టలు.. టీచర్ సస్పెండ్!
ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు..
ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు..
బంగారం ధరలపై బిగ్ న్యూస్.. వారం రోజుల్లో ఎంత పెరిగాయంటే..?
బంగారం ధరలపై బిగ్ న్యూస్.. వారం రోజుల్లో ఎంత పెరిగాయంటే..?
ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..నారా లోకేశ్ ట్వీట్
ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..నారా లోకేశ్ ట్వీట్
అమెరికాలో కాల్పులు.. గర్భిణి, ఇద్దరు చిన్నారులు సహా 9 మంది మృతి!
అమెరికాలో కాల్పులు.. గర్భిణి, ఇద్దరు చిన్నారులు సహా 9 మంది మృతి!
చికెన్, మటన్‌ను మించిన రుచి.. వంకాయలతో ఎండు చేపల కూర ఇలా చేస్తే..
చికెన్, మటన్‌ను మించిన రుచి.. వంకాయలతో ఎండు చేపల కూర ఇలా చేస్తే..
అపూర్వ ఎలిమినేషన్.. మూడు వారాలకు ఎంత రెమ్యునరేషన్..
అపూర్వ ఎలిమినేషన్.. మూడు వారాలకు ఎంత రెమ్యునరేషన్..
బయట కరకర.. లోపల మెత్తగా.. అప్పటికప్పుడు చల్లపునుగులు ఇలా చేసేయండి
బయట కరకర.. లోపల మెత్తగా.. అప్పటికప్పుడు చల్లపునుగులు ఇలా చేసేయండి
ఉప్పొంగిన బుధిగండకి నది.. నేపాల్‌ను మరోసారి ముంచెత్తిన జలప్రలయం!
ఉప్పొంగిన బుధిగండకి నది.. నేపాల్‌ను మరోసారి ముంచెత్తిన జలప్రలయం!
రైతును అవమానించిన గజ్వేల్ MROపై సస్పెన్షన్ వేటు
రైతును అవమానించిన గజ్వేల్ MROపై సస్పెన్షన్ వేటు