AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nepal Floods: ఉప్పొంగిన బుధిగండకి నది.. నేపాల్‌ను మరోసారి ముంచెత్తిన జలప్రలయం!

నేపాల్‌లో మరోసారి ప్రకృతి ప్రకోపం కనిపించింది. బుధిగండకి నదిలో ఒక్కసారిగా పోటెత్తిన మెరుపు వరదలు తీవ్ర భయాందోళన సృష్టించాయి. ఈ ఉధృత వరద ప్రవాహంలో గోర్ఖా సల్లెరి బజార్ కొట్టుకుపోయింది. హిమాలయ ప్రాంతాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

Nepal Floods: ఉప్పొంగిన బుధిగండకి నది.. నేపాల్‌ను మరోసారి ముంచెత్తిన జలప్రలయం!
Nepal Flash Floods
Anand T
|

Updated on: Oct 11, 2026 | 10:32 AM

Share

నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా పెరిగిన బుధిగండకి నది వరద ప్రవాహం.. స్థానికంగా ఉన్న గోర్ఖా సల్లెరి బజార్‌ను ముంచెత్తింది. సాధారణంగా ఈ నది ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న ఇరుకైన లోయల గుండా ప్రవహిస్తుస్తూ ఉంటుంది. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగి కిందుకు దూసుకొచ్చింది. అదే సమయంలో భారీగా కొండచరియలు విరిగిపడడంతో నదీ ప్రవాహానికి అడ్డంకట్ట పడింది. అయితే కాసేపటికే ఆ అడ్డుకట్ట తొలగిపోవడంతో దిగువనున్న గ్రామాలపైకి ఆ వరద ఒక్కసారిగా దూసుకొచ్చింది. గత నెల 2వ తేదీన కూడా బుధిగండకి నది ఇదే విధంగా ప్రమాదకర స్థాయిలో పోటెత్తి జనావాసాలను ముంచెత్తింది.

ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం.. 

ప్రస్తుతం బుధిగండకి నదిలో వరద నీరు అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గోర్ఖా జిల్లా అరుఘాట్‌ వద్ద డేంజర్‌ లెవల్ కంటే 3.5 మీటర్ల ఎత్తులో వరద నీరు పారుతోంది. నీటిమట్టం ఇంకా పెరుగుతోందని అధికారులు హెచ్చరిస్తుండటంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా చుమానుబ్రి మున్సిపాలిటీ ప్రజలను అప్రమత్తం చేస్తూ, వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. వరద తగ్గే వరకు నదీ సమీపంలోకి ఎవరూ వెళ్లవద్దని, పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌లకు ప్రయత్నించవద్దని ఆదేశాలు జారీ చేశారు.

రంగంలోకి సహాయక బృందాలు

మరోవైపు భారీ వరద కారణంగా ప్రమాదంలో చిక్కుకున్న వందలాది మంది బాధితులను అధికారులు, సహాయక బృందాలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని నీటిలో చిక్కుకుపోయిన మిగితా ప్రజలను కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

వీడియో చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us