AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: విద్యార్థి గుండుపై తబలా వాయిస్తూ వెకిలి చేష్టలు.. టీచర్ సస్పెండ్! వీడియో వైరల్

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు.. ఓ చిన్నారితో ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. విద్యార్థి గుండు చేసిన తలపై తబలా వాయిస్తున్నట్లుగా నటిస్తూ నవ్వులు పూయించిన ఉపాధ్యాయుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై విద్యాశాఖకు ఫిర్యాదులు అందడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. సదరు ఉపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేశారు. అసలేం జరిగిందంటే..?

Viral Video: విద్యార్థి గుండుపై తబలా వాయిస్తూ వెకిలి చేష్టలు.. టీచర్ సస్పెండ్! వీడియో వైరల్
Teacher Playing Tabla On Student Shaved Head
Srilakshmi C
|

Updated on: Oct 11, 2026 | 11:15 AM

Share

ఉత్తరప్రదేశ్, అక్టోబర్ 11: ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో సైఫాయ్ బ్లాక్ పరిధిలో ఉన్న బిరౌలి ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్న దినేశ్ కుమార్ మాథుర్ తరగతి గదిలో విద్యార్థుల మధ్య కుర్చీలో కూర్చున్నాడు. విద్యార్థులంతా నేలపై కూర్చొని ఉండగా, ఒక చిన్నారి ఆయన ఎదురుగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థి గుండు చేసిన తలపై చేతులతో తబలా వాయిస్తున్నట్లుగా ఉపాధ్యాయుడు నటించాడు. అలా చేస్తూ పెద్దగా నవ్వుతూ కనిపించాడు. ఈ దృశ్యాలను ఎవరు చిత్రీకరించారో స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ వీడియోను ఉపాధ్యాయుడే తన ఫేస్‌బుక్ ఖాతాలో అప్‌లోడ్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా బేసిక్ శిక్షా అధికారి (BSA) డాక్టర్ రాజేశ్ కుమార్ తక్షణమే స్పందించారు. విద్యార్థితో ఉపాధ్యాయుడు ప్రవర్తించిన తీరుపై చర్యలు తీసుకుంటూ దినేశ్ కుమార్ మాథుర్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరికి ఈ ఘటన సరదాగా అనిపించినప్పటికీ, ఆ చిన్నారి మనసుపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించాలని పలువురు సూచిస్తున్నారు. ఇతరుల ముందు ఇలా చేయడం వల్ల విద్యార్థి అవమానంగా భావించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ‘ఇందులో నవ్వుకోవాల్సింది ఏమీ లేదు’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. చిన్న వయసులో ఇలాంటి చర్యలు పిల్లల్లో అభద్రతా భావాన్ని కలిగించవచ్చని మరొకరు పేర్కొన్నారు.

View this post on Instagram

A post shared by NDTV India (@ndtvindia)

మరో నెటిజన్ స్పందిస్తూ.. పిల్లల మానసిక స్థితిపై ఇలాంటి సంఘటనలు ఎలాంటి ప్రభావం చూపుతాయో పెద్దలు గుర్తించాలని అన్నారు. విద్యార్థులను ఆదరంగా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడే ఇలా ప్రవర్తించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు వారి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా కలిగి ఉంటారు. సరదా పేరుతో చేసే పనులు చిన్నారులను ఇబ్బందికి గురిచేయకుండా జాగ్రత్తపడాలి. ఈ ఘటనతో పాఠశాలల్లో పిల్లల పట్ల ఉపాధ్యాయుల ప్రవర్తన, వారి మానసిక భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

Follow Us
విద్యార్థి గుండుపై తబలా వాయిస్తూ వెకిలి చేష్టలు.. టీచర్ సస్పెండ్!
విద్యార్థి గుండుపై తబలా వాయిస్తూ వెకిలి చేష్టలు.. టీచర్ సస్పెండ్!
ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు..
ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు..
బంగారం ధరలపై బిగ్ న్యూస్.. వారం రోజుల్లో ఎంత పెరిగాయంటే..?
బంగారం ధరలపై బిగ్ న్యూస్.. వారం రోజుల్లో ఎంత పెరిగాయంటే..?
ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..నారా లోకేశ్ ట్వీట్
ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..నారా లోకేశ్ ట్వీట్
అమెరికాలో కాల్పులు.. గర్భిణి, ఇద్దరు చిన్నారులు సహా 9 మంది మృతి!
అమెరికాలో కాల్పులు.. గర్భిణి, ఇద్దరు చిన్నారులు సహా 9 మంది మృతి!
చికెన్, మటన్‌ను మించిన రుచి.. వంకాయలతో ఎండు చేపల కూర ఇలా చేస్తే..
చికెన్, మటన్‌ను మించిన రుచి.. వంకాయలతో ఎండు చేపల కూర ఇలా చేస్తే..
అపూర్వ ఎలిమినేషన్.. మూడు వారాలకు ఎంత రెమ్యునరేషన్..
అపూర్వ ఎలిమినేషన్.. మూడు వారాలకు ఎంత రెమ్యునరేషన్..
బయట కరకర.. లోపల మెత్తగా.. అప్పటికప్పుడు చల్లపునుగులు ఇలా చేసేయండి
బయట కరకర.. లోపల మెత్తగా.. అప్పటికప్పుడు చల్లపునుగులు ఇలా చేసేయండి
ఉప్పొంగిన బుధిగండకి నది.. నేపాల్‌ను మరోసారి ముంచెత్తిన జలప్రలయం!
ఉప్పొంగిన బుధిగండకి నది.. నేపాల్‌ను మరోసారి ముంచెత్తిన జలప్రలయం!
రైతును అవమానించిన గజ్వేల్ MROపై సస్పెన్షన్ వేటు
రైతును అవమానించిన గజ్వేల్ MROపై సస్పెన్షన్ వేటు