Anushka Virat: కరోనవేళ గడిపిన ఆ క్షణాలు మరిచిపోలేనివని అంటోన్న అనుష్క.. ఆకట్టుకుంటోన్న విరుష్క జంట వీడియో..

Anushka Virat Video: కరోనా మహమ్మారి సృష్టించిన, సృష్టిస్తోన్న ప్రకంపనలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజా జీవనం పూర్తిగా స్థంభించిపోయింది. సినిమా తారల నుంచి క్రికెటర్...

Anushka Virat: కరోనవేళ గడిపిన ఆ క్షణాలు మరిచిపోలేనివని అంటోన్న అనుష్క.. ఆకట్టుకుంటోన్న విరుష్క జంట వీడియో..
Virak Kohli And Anushka Sharma
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 16, 2021 | 7:28 PM

Anushka Virat Video: కరోనా మహమ్మారి సృష్టించిన, సృష్టిస్తోన్న ప్రకంపనలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజా జీవనం పూర్తిగా స్థంభించిపోయింది. సినిమా తారల నుంచి క్రికెటర్‌ ప్లేయర్స్‌ వరకు అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్నవారంతా ఏదో ఒక వ్యాపకాన్ని ఎంచుకున్నారు. సెలబ్రిటీ జంటల్లో ఒకరైన నటి అనుష్క, క్రికెటర్‌ విరాట్ కోహ్లి కూడా లాక్‌డౌన్‌ సమయాన్ని జాలీగా గడిపారు.

ఈ క్రమంలోనే విరుష్క జంట తమ పెంపుడు శున‌కాల‌తో కలిసి కొన్ని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి సరదాగా గడిపారు. అయితే ఇదే సమయంలో విరుష్క జంట ఓ గ్రామంలోకి వెళ్లే సరికి ఊర్లోని వీధి కుక్కులు పెద్ద ఎత్తున వారి దగ్గరికి వచ్చాయి. దీంతో తమ వెంట తెచ్చుకున్న ఫుడ్‌ను అనుష్క, విరాట్‌లు ఆ శున‌కాల‌తో పంచుకున్నారు. ఇద్దరు కలిసి వారికి ఆప్యాయంగా ఫుడ్‌ పెట్టారు. తాజాగా అనుష్క శర్మ వాటికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఇక ఈ వీడియోకు ‘గతేడాది గడిపిన కొన్ని ప్రత్యేకమైన, వెలకట్టలేని మధుర క్షణాలు ఇవే’నంటూ క్యాప్షన్‌ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే విరుష్క జంట ఇటీవలే ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట తమ చిన్నారిని ఇప్పటి వరకు ప్రపంచానికి పరిచయం చేయలేదు.

అనుష్క పోస్ట్‌ చేసిన వీడియో..

Also Read: love Story Movie: చిరు సినిమా డేట్ పై కన్నెేసిన నాగచైతన్య.. ‘లవ్ స్టోరీ’ విడుదల ఆరోజునే..

Viral: కూరగాయలు సర్దుతుండగా భార్యాభర్తలకు ఊహించని షాక్.. పాలకూర‌లో నక్కిన పాము.. భయానక వీడియో.!

PM Modi on oxygen: ప్రాణవాయువు కొరత రానివ్వకండి.. ఆక్సిజన్‌ లభ్యత, వినియోగంపై ప్రధాని మోదీ సమీక్ష