అనుష్కనా..? సమంతనా..? ఆ బయోపిక్‌లో ఎవరు..?

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ సినిమాను తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఫిలింనగర్‌లో గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 4:29 pm, Sun, 29 March 20
అనుష్కనా..? సమంతనా..? ఆ బయోపిక్‌లో ఎవరు..?

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ సినిమాను తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఫిలింనగర్‌లో గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక గాయని, ప్రముఖ యాక్టివిస్ట్ బెంగళూరు నాగరత్నమ్మ జీవిత కథ ఆధారంగా ఆయన ఓ బయోపిక్‌ను తెరకెక్కించాలనుకుంటున్నారట. ఇక ఇందులో ప్రధాన పాత్రకు గానూ అనుష్కను సంప్రదించారట. అయితే కథను విన్నప్పటికీ.. ఆమె మాత్రం ఇంకా సినిమాకు సంతకం చేయలేదట. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సమంతను సంప్రదించాలని అనుకుంటున్నారట. ఒకవేళ అనుష్క ఈ సినిమాకు సంతకం చేయకపోతే.. ఆ స్థానంలో సమంతను తీసుకోవాలని భావిస్తున్నారట. మరి మొత్తానికి ఈ బయోపిక్‌లో నటించే అవకాశం ఎవరు సొంతం చేసుకుంటారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా అనుష్క, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్దం అనే చిత్రంలో నటించింది. మాధవన్, అంజలి, శాలిని, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీని ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడింది. మరోవైపు సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో నటించగా.. గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం కరోనా బ్రేక్ తరువాత సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read This Story Also: పాట పాడిన పవన్ కుమార్తె ఆధ్య.. పారిపోయిన అకీరా..!