మేకప్ లేకుండా యాంకర్ సుమ.. వీడియో వైరల్!
టాలీవుడ్ యాంకర్లలో సుమకు ప్రత్యేక స్థానం ఉంది. పేరుకు మలయాళీ అమ్మాయే అయినా.. తెలుగు మాత్రం అనర్గళంగా మాట్లాడుతూ.. బుల్లితెరను ఏలేస్తుంది. ఈవెంట్లు, రియాల్టీ షోలు, గేమ్ షోలు, ఆడియో ఫంక్షలు ఇలా ఒకటేంటి.. తదితర ఫంక్షన్లకు కూడా సుమనే హోస్టుగా ఉండాలని చాలా మంది హీరోలు పట్టుబడుతూంటారు. చాలాకీ తనం, ఆన్ స్పాట్ పంచెస్ ఆమెకి మరో ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఎంతమంది యాంకర్లు ఉన్నాకూడా సుమ స్థానం సుమదే. ఆమెకు ఉండే […]

టాలీవుడ్ యాంకర్లలో సుమకు ప్రత్యేక స్థానం ఉంది. పేరుకు మలయాళీ అమ్మాయే అయినా.. తెలుగు మాత్రం అనర్గళంగా మాట్లాడుతూ.. బుల్లితెరను ఏలేస్తుంది. ఈవెంట్లు, రియాల్టీ షోలు, గేమ్ షోలు, ఆడియో ఫంక్షలు ఇలా ఒకటేంటి.. తదితర ఫంక్షన్లకు కూడా సుమనే హోస్టుగా ఉండాలని చాలా మంది హీరోలు పట్టుబడుతూంటారు. చాలాకీ తనం, ఆన్ స్పాట్ పంచెస్ ఆమెకి మరో ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఎంతమంది యాంకర్లు ఉన్నాకూడా సుమ స్థానం సుమదే. ఆమెకు ఉండే స్టార్‌డమ్ అలాంటిది మరి. నిత్యం రోజూ మేకప్‌తోనే.. కనిపించే సుమ.. మేకప్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది.
అలాంటి ఓ వీడియోనే ఆమె లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఫుల్‌గా వైరల్ అవుతోంది. గుడ్ మార్నింగ్.. క్యాష్ ప్రోగ్రామ్ చేశాక నాకు మార్నింగ్ ఇలానే ఉంటుందని ఆ వీడియో చెబుతూ.. ప్రోగ్రామ్‌లో ఫ్యాన్స్ తనకు బహుకరించిన గిఫ్ట్స్ గురించి చెప్పుకొచ్చింది. ఇలాంటివి చూస్తుంటేనే.. వారికోసమైనా మేకప్ వేసుకొని కష్టపడి పనిచేయాలని పిస్తుందంటూ వీడియోలో చెప్పింది. కాగా.. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మీరు మేకప్ లేకుండానే చాలా బావున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.