సన్‌రైజర్స్ ఆటగాళ్లకు గారెలు తినిపించిన సుమ
హైదరాబాద్: సన్‌రైజర్స్ ఆటగాళ్లకు యాంకర్ సుమ గారెలు తినిపించింది. మరికొన్నిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రమోషనల్ ఈవెంట్లతో టోర్నీ ప్రారంభానికి కన్నా ముందుగానే అభిమానులను అలరిస్తున్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాళ్లు యాంకర్ సుమతో చేసిన తాజా యాడ్ ఆసక్తికరంగా ఉంది. యాంకర్ సుమతో కలిసి సందడి చేశారు. డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్ వంటి ఆటగాళ్లతో ఆమె నటించింది. ఉత్సాహంగా యాడ్ చిత్రీకరణలో పాల్గొంది. ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయ వంటకాలైన మినప […]

హైదరాబాద్: సన్‌రైజర్స్ ఆటగాళ్లకు యాంకర్ సుమ గారెలు తినిపించింది. మరికొన్నిరోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రమోషనల్ ఈవెంట్లతో టోర్నీ ప్రారంభానికి కన్నా ముందుగానే అభిమానులను అలరిస్తున్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాళ్లు యాంకర్ సుమతో చేసిన తాజా యాడ్ ఆసక్తికరంగా ఉంది.
యాంకర్ సుమతో కలిసి సందడి చేశారు. డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్ వంటి ఆటగాళ్లతో ఆమె నటించింది. ఉత్సాహంగా యాడ్ చిత్రీకరణలో పాల్గొంది. ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయ వంటకాలైన మినప గారెలు, వడలను ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు వార్నర్ కు రుచిచూపించింది. భువనేశ్వర్ కుమార్ కూడా రుచికరమైన వంటకాలను టేస్ట్ చేశాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తున్నాయి.