Anasuya Bharadwaj : పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోన్న రంగమ్మత్త.. ముహర్తం ఖరారంటూ టాక్

అనసూయ భరద్వాజ్ బుల్లి తెరపై న్యూస్ రీడర్‌గా అడుగు పెట్టి.. అనంతరం జబర్దస్త్ షో తో యాంకర్‌గా టర్న్ తీసుకుంది. ఇక షోలో తన ముద్దుముద్దు మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది...

Anasuya Bharadwaj : పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోన్న రంగమ్మత్త.. ముహర్తం ఖరారంటూ టాక్
ప్రస్తుతం అనసూయ రవితేజ నటిస్తున్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పాలోను ఓ పాత్ర చేస్తున్నట్టు సమాచారం. 

Updated on: Feb 15, 2021 | 12:00 PM

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ బుల్లి తెరపై న్యూస్ రీడర్‌గా అడుగు పెట్టి.. అనంతరం జబర్దస్త్ షో తో యాంకర్‌గా టర్న్ తీసుకుంది. ఇక షోలో తన ముద్దుముద్దు మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ వైపు వివిధ షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు సోగ్గాడే చిన్నినాయనా సినిమా తో వెండి తెరపై అడుగు పెట్టింది. అనంతరం క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో విభిన్న నేపధ్య పాత్రలను పోషిస్తూ.. తన కంటూ ఓ ఫేమ్ సంపాదించుకుంది ఈ చిన్నది.. అయితే చాలా మంది నటులుగా తమ కంటూ ఓ పేరు, ఫేమ్ సంపాదించుకున్న తర్వాత రాజకీయల వైపు చూస్తారు అన్న మాటలను అనసూయ నిజం చేయడానికి రెడీ అవుతుంది టాక్ వినిపిస్తోంది.

అవును పాపులర్ యాంకర్ కమ్ యాక్టర్ అయిన అనసూయ భరద్వాజ్ రాజకీయ అరంగ్రేటం చేయడానికి ముహర్తం ఖరారైనట్లు సన్నిహిత వర్గాల టాక్. అనసూయకు ఇరురాష్ట్రాల రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు ఇప్పటికే అందుతున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజకీయ అరంగ్రేటం కోసం ఏ పార్టీ అయితే మంచిది అని సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ రంగమ్మత్త రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ,ముహర్తం కూడా పెట్టుకుందని ఫిల్మ్ నగర్‌లో ఓ టాక్ వినిపిస్తోంది.

జబర్దస్త్ షో జడ్జిగ వ్యవహరిస్తున్న రోజా గైడెన్స్ తోనే అనసూయ రాజకీయాల వైపు చూస్తున్నట్లు.. ఆంతేకాదు ఆమె బాటలోనే త్వరలో రాజకీయాల్లో అడుగు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు మంచి ముహర్తలు లేవు కనుక వచ్చే మే నెలలో మంచి ముహర్తాల్లో అధికారికంగా పొలిటికల్ ఎంట్రీ ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: