పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమృతా రావు

నటి అమృతా రావు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఆమె మగ బిడ్డకు జన్మనివ్వగా.. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమృతా రావు

Edited By:

Updated on: Nov 02, 2020 | 10:44 AM

Actress Amrita Rao: నటి అమృతా రావు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఆమె మగ బిడ్డకు జన్మనివ్వగా.. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు అమృతా టీం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2016లో తన ప్రియుడు, ఆర్జే ఆన్‌మోల్‌ని అమృతా పెళ్లాడగా.. వారిద్దరికి ఇది మొదటి సంతానం. గత నెలలో తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించిన అమృత.. త్వరలో మా కుటుంబంలోకి మరో వ్యక్తి రాబోతున్నారంటూ తెలిపింది. కాగా బాలీవుడ్‌లో వివాహ్‌, ఇష్క్‌విష్క్‌, మై హూనా వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన అమృతా.. తెలుగులో మహేష్‌ బాబు సరసన అతిథిలో జోడీ కట్టిన విషయం తెలిసిందే.

Read More:

షాకింగ్‌.. యువ సంగీత దర్శకుడు హఠాన్మరణం

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 922 కొత్త కేసులు.. 7 మరణాలు