Allu Arjun : యూట్యూబ్ లో మరో రికార్డ్ సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ సినిమా.. ఏకంగా 300 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది..

|

Jan 24, 2021 | 5:49 AM

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్  ప్రస్తుతం సుకుమార్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు బన్నీ..

Allu Arjun : యూట్యూబ్ లో మరో రికార్డ్ సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ సినిమా.. ఏకంగా 300 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది..
Follow us on

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్  ప్రస్తుతం సుకుమార్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు బన్నీ. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా అందాల భామ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే బన్నీ నటించిన సినిమాలు హిందీలోనూ డబ్ అవుతూ ఉంటాయి. ఈ సినిమాలు యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటాయి. తాజాగా బన్నీ నటించిన డీజే సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెండేళ్ళ కింద విడుదలైన ఈ సినిమా ఇప్పుడు యూ ట్యూబ్‌లో ఏకంగా 300 మిలియన్ వ్యూస్ దాటేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకీ నాయక, అల్లు అర్జున్ సరైనోడు సినిమాలు మాత్రమే 300 మిలియన్ వ్యూస్ దాటాయి. ఇప్పుడు తెలుగు నుంచి అరుదైన ఘనత సాధించిన మూడో సినిమాగా ‘డిజే’ నిలిచింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Love story movie: నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ థియేటర్స్‏లోకి వచ్చేదీ అప్పుడే ? ప్లాన్ చేస్తున్న మూవీ మేకర్స్…