Hero Allari Naresh: ఓటీటీలోకి క్రేజీ సినిమా.. ‘నాంది’తో ఎంటర్ అవ్వనున్న అల్లరి నరేష్ ?
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా 'నాంది'. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి
టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘నాంది’. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కాస్తా సీరియస్ లుక్‌లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. జైలు బ్యాక్ డ్రాప్లో ఉండనున్న ఈ మూవీని దర్శకుడు సతీష్ విగ్నేష్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో నరేష్ పోలీస్ స్టేషన్లో నగ్నంగా కూర్చోని ఉన్నాడు. దీంతో అల్లరి నరేష్ నుంచి థ్రిల్లర్ మూవీ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కోడుతుంది.
అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న ‘నాంది’ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా ఫుల్ రైట్స్‌ను జీ స్టూడియో తీసుకున్నట్లుగా సమాచారం. ఇక నాంది మూవీ థియేట్రికల్ శాటిలైట్ రైట్స్‌తోపాటు డిజిటల్ హక్కులను కూడా జీ సంస్థ సొంతం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మొత్తం రూ.8.5 కోట్లకు ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. ఇటీవల నరేష్ నటించిన బంగారు బుల్లోడు థియేటర్లో విడుదైన సంగతి తెలిసిందే. పుల్ కామెడీ ఎంటర్ టైనర్‌గా వచ్చిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
Also Read:
Krithi Shetty : కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిన ముద్దుగుమ్మ.. కృతిశెట్టి కోసం క్యూ కడుతున్న ఆఫర్లు