Cannes Film Festival 2022: కేన్స్‌లో తళుక్కుమంటోన్న భారతీయ ముద్దుగుమ్మలు.. కళ్లు తిప్పుకోనివ్వని అందంతో..

Cannes Film Festival 2022: ఈ వేడుకల్లో తొలిరోజున తమన్నా, దీపిక, ఊర్వశి రౌతెల్లా రెడ్‌ కార్పెట్‌పై తళుక్కుమనగా.. రెండో రోజు ఐశ్వర్యారాయ్‌ (Aishwarya Rai) , పూజాహెగ్డే (Pooja Hegde) సందడి చేశారు. తమ ఫ్యాషనబుల్‌ డ్రెస్‌లతో, గ్లామరస్‌ లుక్స్‌తో రెడ్‌కార్పెట్‌ను హీటెక్కించారు

Cannes Film Festival 2022: కేన్స్‌లో తళుక్కుమంటోన్న భారతీయ ముద్దుగుమ్మలు.. కళ్లు తిప్పుకోనివ్వని అందంతో..
Cannes Film Festival 2022

Updated on: May 19, 2022 | 12:38 PM

Cannes Film Festival 2022: ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ చలనచిత్రోత్సవాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఈసారి మన దేశం నుంచి భారీ బృందమే హాజరైంది. ఐశ్వర్యారాయ్‌, దీపికా పదుకొణె, నయనతార, పూజాహెగ్డే, తమన్నా, ఊర్వశి రౌతెలా, హీనాఖాన్‌, కమల్‌హాసన్‌, ఏ ఆర్‌ రెహమాన్‌, మాధవన్‌, నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ, కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, శేఖర్‌ కపూర్‌, రిక్కీ కేజ్‌, సీబీఎఫ్‌సీ చైర్‌ పర్సన్‌ ప్రసూన్‌ జోషి తదితరులు పాల్గొంటున్నారు. ఈసారి ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సౌతిండియన్‌ తారల ప్రాతినిథ్యం ఎక్కువగా ఉండడం విశేషం. కాగా ఈ వేడుకల్లో తొలిరోజున తమన్నా, దీపిక, ఊర్వశి రౌతెల్లా రెడ్‌ కార్పెట్‌పై తళుక్కుమనగా.. రెండో రోజు ఐశ్వర్యారాయ్‌ (Aishwarya Rai) , పూజాహెగ్డే (Pooja Hegde) సందడి చేశారు. తమ ఫ్యాషనబుల్‌ డ్రెస్‌లతో, గ్లామరస్‌ లుక్స్‌తో రెడ్‌కార్పెట్‌ను హీటెక్కించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి..

కళ్లన్నీ క్వీన్‌ ఆఫ్‌ కేన్స్‌ వైపే..

ఇవి కూడా చదవండి

ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రెండో రోజు హైలెట్‌ అంటే ఐశ్వర్యారాయ్‌. క్వీన్‌ ఆఫ్‌ కేన్స్‌గా గుర్తింపు పొందిన ఈ అందాల తార నలుపు, పూలగౌనులో దర్శనమిచ్చింది. సింపుల్‌ మేకప్‌తో రెడ్‌ కార్పెట్‌పైకి ఐశ్వర్య అడుగుపెట్టగానే అతిథుల కళ్లతో పాటు కెమెరాల కళ్లన్నీ ఆమె వైపే తిరిగాయి. ప్రస్తుతం ఐశ్వర్య ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.

బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిన మిల్కీ బ్యూటీ..

మొదటి రోజున బ్లాక్ అండ్‌ వైబ్‌ కాంబినేషన్‌ గౌనులో తళుక్కుమన్న తమన్నా రెండోరోజూ కూడా తన ఫ్యాషన్‌ సెన్స్‌ను చాటుకుంది. నలుపు రంగు నెక్‌లైన్ బాడీకాన్ గౌనుతో రెడ్‌ కార్పెట్‌ను హీటెక్కించింది. బన్‌ కప్‌ హెయిర్‌ స్టైల్‌, పొడవాటి చెవి పోగులు మిల్కీబ్యూటీ అందాన్ని రెట్టింపు చేశాయి.

గోల్డ్‌ కలర్‌ గౌనులో బుట్టబొమ్మ ర్యాంప్‌ వాక్‌..

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భాగంగా బుట్టబొమ్మ పూజాహెగ్డే క్రీమ్‌, గోల్డ్‌ కలర్‌ గౌనులో హొయలొలికించారు. హాలీవుడ్‌ స్టార్‌ హీరో టామ్‌ క్రూజ్‌ టాప్‌గన్‌ మావెరిక్‌ ప్రీమియర్‌కు హాజరమైన ఆమె రెడ్ కార్పెట్‌పై ర్యాంప్‌ వాక్‌ చేసింది. ఈ సందర్భంగా బుట్టబొమ్మ ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీపడ్డారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

KRK OTT: ఓటీటీలో సేతుపతి, సామ్‌, నయన్‌ల సినిమా.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Vikram: ఇట్స్‌ అఫీషియల్‌.. కమల్‌ సినిమాలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఇక ఫ్యాన్స్‌కు పండగే..

Ratan Tata: నానో కారులో తాజ్‌ హోటల్‌కు రతన్‌ టాటా.. బిలియనీర్‌ నిరాడంబరతకు అందరూ ఫిదా..