AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అవును.. నా గురువు సినిమాలో నటిస్తున్నా: ఐష్

సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆచితూచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటోన్న మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్.. తన గురువు సినిమాలో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. ‘చెక్క చీవంత వానమ్‌’(తెలుగులో నవాబ్)తో మళ్లీ ఫాంలోకి వచ్చిన లెజండరీ దర్శకుడు మణిరత్నం.. మరో మల్టీస్టారర్ చిత్రానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఐశ్వర్య నటిస్తుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా వాటిపై ఆ భామ వివరణ ఇచ్చింది. ‘‘అవును మణిరత్నం గారి సినిమాలో నటిస్తున్నా. ఈ మూవీపై ఆయన ఇంకా అధికారిక ప్రకటన […]

అవును.. నా గురువు సినిమాలో నటిస్తున్నా: ఐష్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 24, 2019 | 5:58 PM

Share

సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆచితూచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటోన్న మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్.. తన గురువు సినిమాలో నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. ‘చెక్క చీవంత వానమ్‌’(తెలుగులో నవాబ్)తో మళ్లీ ఫాంలోకి వచ్చిన లెజండరీ దర్శకుడు మణిరత్నం.. మరో మల్టీస్టారర్ చిత్రానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఐశ్వర్య నటిస్తుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా వాటిపై ఆ భామ వివరణ ఇచ్చింది.

‘‘అవును మణిరత్నం గారి సినిమాలో నటిస్తున్నా. ఈ మూవీపై ఆయన ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. నా గురువుతో మరోసారి పనిచేసేందుకు చాలా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నా’’ అంటూ తెలిపింది. కాగా ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, అమలా పాల్, సత్యరాజ్ తదితరులు నటిస్తుండగా.. ఐశ్యర్యరాయ్ విలన్‌గా కనిపించనుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇదివరకు మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ ఇదివరకు ఇరువర్(ఇద్దరు) గురు, విలన్(రావణ్) చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే