AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాని సరసన అదితి..!

నేచురల్ స్టార్ నాని డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టారర్ సినిమాగా రూపొందే ఈ చిత్రంలో నాని సరసన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి ని ఎంపిక చేశారట దర్శక నిర్మాతలు. గతంలో ఆమె మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రంలో నటించింది. ఆ సినిమాలో ఆమె అందంతో పాటు అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే ఆమెకు మరోమారు ఇంద్రగంటి […]

నాని సరసన అదితి..!
Ravi Kiran
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 2:20 PM

Share

నేచురల్ స్టార్ నాని డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టారర్ సినిమాగా రూపొందే ఈ చిత్రంలో నాని సరసన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి ని ఎంపిక చేశారట దర్శక నిర్మాతలు. గతంలో ఆమె మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రంలో నటించింది. ఆ సినిమాలో ఆమె అందంతో పాటు అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే ఆమెకు మరోమారు ఇంద్రగంటి అవకాశం ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో నానితో పాటు యంగ్ హీరో సుధీర్ బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. దిల్ రాజు, నాని కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు వినికిడి. కాగా ప్రస్తుతం నాని విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఆయన నటించిన ‘జెర్సీ’ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది.

Follow Us