Warina Hussain : ఆయుష శర్మ హీరోగా సల్మాన్ ఖాన్ నిర్మించిన లవ్ యాత్రి మూవీతో తొలిసారిగా వెండి తెరపై అడుగు పెట్టింది వరిన. తర్వాత మున్నాకి బదనాము హూయీ.. అంటూ దబాంగ్ 3లో అదిరిపోయే స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఆ సాంగ్ తో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. “షీ మూవ్స్ ఇట్ లైక్” అనే బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ లో కూడా వరీన నటించింది. నటిగా నర్తకిగా భారీ అభిమాన గానాన్ని సంపాదించుకుంది సుందరి.
గోవాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తనను ఇన్స్పైర్ చేసిని ఓ మహిళల వ్యక్తిత్వం అంటూ ఓ ఫోటోను షోషల్ మీడియాలో షేర్ చేసింది. మనం జనంలో ఉన్న సమయంలో చూస్తుంటే ఈ దశాబ్దపు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. చాలా వాటిల్లో గేమ్ చెంజర్ గా మారుతున్నారు .. వారి నుంచి మనం ఎంతో ప్రేరణ పొందవచ్చు అని చెప్పారు.
ఇటీవల గోవా లో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు తీరిన దొరికినప్పుడల్లా ఓ ఆయుర్వేద కేంద్రానికి మసాజ్ కోసం వెళ్లేదానిని చెప్పారు. అక్కడ తాను ఓ యువతిని కలిశానని.. తన భర్త మరణించిన తర్వాత జీవనోపాధికి పిల్లాడిని పెంచుకోవడం కోసం సొంత ఊరును వదిలి చిన్నారితో గోవాకు వచ్చినట్లు ఆ యువతి తనకు చెప్పిందని అన్నారు వరిన.
మొదట్లో చదువు, అనుభవం లేకపోవడంతో పనిదొరకడం కష్టమైంది.. అయితే తనకు మసాజ్ సెంటర్ లో పని దొరికింది. దీంతో తాను ఎంతో త్వరగా మసాజ్ చేయడం లో నైపుణ్యం సంపాదించుకున్నానని ఆ యువతి తనకు చెప్పిందని వరీన ఆ యువతిని ధైర్యాన్ని పనితనాన్ని మెచ్చుకున్నారు. అయితే మసాజ్ చేసే సమయంలో తనను కొన్ని సార్లు బిడ్డకు పాలు ఇస్తానమ్మా కొంచెం సమయం ఇవు అని అడిగేదని .. ఆమె పరిస్థితులను ఎదిరించి జీవిస్తున్న తీరు నాకు ఎప్పుడు ప్రేరణ అంటూ తెలిపారు వరిన
అయితే ఇప్పటికీ చాలా మంది స్త్రీ పురుషులు అంటూ లింగ బేధం చూపిస్తున్నారని.. వివక్షతకు గురి చేస్తున్నారని చెప్పారు. అణిచివేత నుంచి స్త్రీ శక్తిగా మారుతుందని పురుషులకంటే మహిళలు ఏ విధంగా తక్కువ కాదని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు.
వరిన హుస్సేన్ టాలీవుడ్ లో కూడా త్వరలో అడుగు పెట్టబోతోంది.. ఎన్టీఆర్ ప్రొడక్షన్ బ్యానర్ కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమాలో వరిన హీరోయిన్ గా ఎంపికయినట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read: