AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidya Balan: ‘మాది లస్ట్‌ ఎట్‌ ఫస్ట్ సైట్‌’… బోల్డ్‌ కామెంట్స్‌ చేసిన విద్యా బాలన్‌.

అల్టీమేట్‌ పెర్ఫామెన్స్‌తోనే కాదు... అంతకు మించిన బోల్డ్ స్టేట్మెంట్స్‌తోనూ ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తుంటారు బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్. మూవీ సెలక్షన్ విషయంలో పర్టిక్యులర్‌గా ఉండే ఈ బ్యూటీ... మీడియాలో మాట్లాడే విషయంలోనూ అంతే డిఫరెంట్ అనిపించుకుంటున్నారు. తాజాగా తన ఫ్యామిలీ లైఫ్‌ గురించి ఈ బ్యూటీ చేసిన కామెంట్స్‌ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.

Vidya Balan: 'మాది లస్ట్‌ ఎట్‌ ఫస్ట్ సైట్‌'... బోల్డ్‌ కామెంట్స్‌ చేసిన విద్యా బాలన్‌.
Vidya Balan
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 09, 2023 | 8:35 AM

Share

అల్టీమేట్‌ పెర్ఫామెన్స్‌తోనే కాదు… అంతకు మించిన బోల్డ్ స్టేట్మెంట్స్‌తోనూ ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తుంటారు బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్. మూవీ సెలక్షన్ విషయంలో పర్టిక్యులర్‌గా ఉండే ఈ బ్యూటీ… మీడియాలో మాట్లాడే విషయంలోనూ అంతే డిఫరెంట్ అనిపించుకుంటున్నారు. తాజాగా తన ఫ్యామిలీ లైఫ్‌ గురించి ఈ బ్యూటీ చేసిన కామెంట్స్‌ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.

విద్యాబాలన్‌… ఈమె సినిమా ఒప్పుకున్నారంటేనే ఏదో స్పెషాలిటీ ఉండే తీరుతుందని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఆషామాషీ కథలకు ఆమె ఓకే చెప్పరని ఓపెన్‌గానే అనేస్తారు. నార్త్ సంగతి ఎలా ఉన్నా, సౌత్‌లో మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తుంటారు విద్యాబాలన్‌. కహానీతో మొదలు పెట్టి వరుసగా బేగం జాన్‌, నట్‌ఖట్‌, శకుంతలా దేవి, షేర్నీ సినిమాలతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్‌గా మారారు విద్యా బాలన్. లేటెస్ట్‌ డిజిటల్ మూవీస్‌ కూడా విద్యా కెరీర్‌లో మైల్‌స్టోన్స్‌గా నిలిచింది. ఇలా వరుసగా ఎక్స్‌పరిమెంటల్ క్యారెక్టర్స్ చేస్తున్నా… తనలో గ్లామర్‌ ఫీల్డ్‌కు కావాల్సిన హాట్ నెస్‌ కూడా ఉందని సోషల్ మీడియా అప్‌డేట్స్‌తో హింట్స్ ఇస్తుంటారు.

తాజాగా విద్యాబాలన్ తన పర్సనల్ లైఫ్‌ గురించి చేసిన ఓ కామెంట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తన భర్తతో పరిచయం గురించి రివీల్ చేసిన విద్యాబాలన్‌, తమది లవ్‌ ఎట్‌ ఫస్ట్ సైట్‌ కాదు, లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్‌ అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సిద్దార్థ్‌ రాయ్‌ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విద్యా. అయితే తనను ఫస్ట్ చూసినప్పుడు ప్రేమకన్నా ముందు ఎట్రాక్షన్‌ ఏర్పడిందని… ఆ తరువాతే తమ మధ్య ప్రేమ చిగురించిందని చెప్పారు. ఈ స్టేట్మెంట్ వైరల్ కావటంతో మరోసారి విద్యా పేరు ట్రెండ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us