Shriya Saran: రాధతో రోమ్‌ వీధుల్లో హల్చల్‌ చేస్తున్న శ్రియ.. వైరల్‌ అవుతోన్న వీడియోలు..

|

Sep 05, 2022 | 6:25 AM

Shriya Saran: శ్రియ.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. 2001లో వచ్చిన...

Shriya Saran: రాధతో రోమ్‌ వీధుల్లో హల్చల్‌ చేస్తున్న శ్రియ.. వైరల్‌ అవుతోన్న వీడియోలు..
Shriya Saran
Follow us on

Shriya Saran: శ్రియ.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. 2001లో వచ్చిన ఇష్టం సినిమాతో మొదలైన శ్రియ సినీ జర్నీ సక్సెస్‌ ఫుల్‌గా సాగింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే 2018లో రోమ్‌కు చెందిన ఆండ్రూ కొశ్చివ్‌ను వివాహం చేసుకుందీ శ్రియ. ఆ తర్వాత ఎక్కువగా రోమ్‌లో గడుపుతూ వస్తోంది.

ఇక 2020లో శ్రియ ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కొన్ని రోజుల పాటు చాలా సీక్రెట్‌గా ఉంచిన ఈ బ్యూటీ ఓ రోజు అభిమానులతో పంచుకుంది. తన కూతురు పేరు ‘రాధ’ అని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక శ్రియ తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 21 ఏళ్లు అవుతోన్న ఏమాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటోంది శ్రియ. ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేకపోయినా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటుందీ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా తన కూతురు రాధతో కలిసి చేసిన సందడికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది శ్రియ.

ఇవి కూడా చదవండి

కూతురు రాధతో రోమ్‌ వీధుల్లో చక్కర్లు కొడుతోన్న సమయంలో తీసిన వీడియోను, అలాగే పాపను ఆడిస్తూ ట్రెడిషనల్‌ డ్రస్‌లో ఉన్న ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఓవైపు అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కూతురికి సమయం కేటాయిస్తూ అటు కెరీర్‌ను ఇటు మధర్‌ హుడ్‌ను బ్యాలెన్స్‌ చేస్తున్న శ్రియ నిజంగానే గ్రేట్‌ కదూ.!

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..