Payal Rajput: పాయల్‌ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్‌.. అసలేమైందంటే..

|

May 20, 2024 | 8:03 AM

పాయల్‌ నటించిన మంగళవారం సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాయల్‌ మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇక ఇటీవల ప్రభాస్‌కు సంబంధించిన వార్తలతో ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది పాయల్‌. ఇదిలా ఉంటే తాజాగా ఓ వివాదం కారణంగా వార్తల్లోకి ఎక్కిందీ బ్యూటీ. పాయల్‌ను తెలుగు సినిమా..

Payal Rajput: పాయల్‌ను సినిమాల నుంచి బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్‌.. అసలేమైందంటే..
Payal
Follow us on

పాయల్‌ రాజ్‌పుత్‌.. తెలుగు సినీ లవర్స్‌కి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. తొలి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అయితే ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే తనకు తొలి విజయాన్ని అందించిన అజయ్‌ భూపతే పాయల్‌కు మరో సాలిడ్ విజయాన్ని అందించాడు.

పాయల్‌ నటించిన మంగళవారం సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాయల్‌ మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇక ఇటీవల ప్రభాస్‌కు సంబంధించిన వార్తలతో ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది పాయల్‌. ఇదిలా ఉంటే తాజాగా ఓ వివాదం కారణంగా వార్తల్లోకి ఎక్కిందీ బ్యూటీ. పాయల్‌ను తెలుగు సినిమా నుంచి బ్యాన్‌ చేస్తామంటూ ఓ చిత్ర యూనిట్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ పాయల్‌ను ఎందుకు బ్యాన్‌ చేస్తామన్నారు. అసలు ఏం జరిగిందో తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపింది.

2019-2020లో ‘రక్షణ’ అనే సినిమాను ఒప్పకున్నానని తెలిపిన పాయల్‌, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యం అయిందని తెలిపింది. అయితే తాజాగా మంగళవారం విజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారని పాయల్ రాసుకొచ్చింది. అయితే అగ్రిమెంట్‌ ప్రకారం తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్‌ చెల్లించకుండానే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని వాపోయింది.

పాయల్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌..

అయితే తాను ప్రస్తుతం అందుబాటులో లేనని, కానీ తన టీమ్‌ ఆ చిత్ర యూనిట్‌తో టచ్‌లో ఉందని తెలిపింది. సినిమా ప్రమోషన్స్‌కు రాకపోతే తెలుగు సపినిమా నుంచి బ్యాన్‌ చేస్తామని బెదిరిస్తున్నారని పాయల్‌ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్‌ ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్‌తో తన టీమ్‌ చెప్పినా, వారు మాత్రం చెల్లించేందుకు ముందుకు రాలేదన్నారు. తన ప్రమేయం లేకుండా ఆ సినిమాలో పేరు, పాత్ర ఉంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని పాయల్‌ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. మరి ఈ వివాదానికి ఎక్కడ ఫుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..