
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నికితా రావల్‌కు ఇటీవల జరిగిన రెడ్ కార్పెట్ కార్యక్రమంలో ఊహించని సంఘటన ఎదురైంది. రెడ్ కార్పెట్ పై ఆమె ఫోటోలకు ఫోజులిస్తుండగా.. ఒక లేడీ అభిమాని సెల్ఫీ అంటూ వచ్చింది. దీంతో నికితా సంతోషంగా ఆమెతోపాటు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఆ అభిమాని నికితాను ముద్దాడుతూ ఆ గట్టిగా పట్టుకుని లిప్ లాక్ ఇచ్చింది. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. నికితా ఆ మహిళను ఎంతగా తోసేస్తున్నప్పటీ గట్టిగా పట్టుకిని లిప్ లాక్ ఇచ్చింది. దీంతో హీరోయిన్ క్షణకాలం పాటు నిశ్చేష్టురాలైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..
అభిమాని చేసిన పనికి షాకైన నికితా.. ఆమెను ఆపడానికి , దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత తన నోటికి చేతిని అడ్డుపెట్టుకుని అలాగే నిల్చుండిపోయింది. అనంతరం తన వ్యక్తిగత సిబ్బంది అక్కడకు చేరుకుగా.. ఒక్క నిమిషం ఆమె భావోద్వేగానికి గురైంది. దీంతో పర్సనల్ టీమ్ ఆమెను ఓదార్చింది. అభిమాని తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. తమకు నచ్చినవారితో అలా ప్రవర్తించడం సరైన పద్దతి కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..
నికితా రావల్ విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్ , దక్షిణాది చిత్రసీమలలో పనిచేశారు. మహారాష్ట్రలోని ముంబైలో పుట్టి పెరిగిన ఈమె, అనిల్ కపూర్ షెఫాలీ షా సరసన బ్లాక్ & వైట్, మిస్టర్ హాట్ మిస్టర్ కూల్, ది హీరో – అభిమన్యు, అమ్మా కి బోలి, గరం మసాలా వంటి చిత్రాల్లో నటించింది. 2012లో తింపా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..