Nabha Natesh: ఆమె స్థాయిలో నేను నటించగలనా అని భయపడ్డాను.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఈస్మార్ట్‌ బ్యూటీ.

Nabha Natesh: సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార నభా నటేష్‌. తొలి చిత్రంతోనే తనదైన అందం, నటనతో..

Nabha Natesh: ఆమె స్థాయిలో నేను నటించగలనా అని భయపడ్డాను.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఈస్మార్ట్‌ బ్యూటీ.

Updated on: Sep 13, 2021 | 5:57 PM

Nabha Natesh: సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార నభా నటేష్‌. తొలి చిత్రంతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో భారీ కమర్షియల్‌ విజయాన్ని అందుకుందీ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తెలంగాణ యాసలో పలికిన డైలాగ్‌లు, అందచెందాలతో కుర్రకారు మతులను పోగొట్టింది. ఇక తాజాగా నితిన్‌ హీరోగా తెరకెక్కిన ‘మ్యాస్ట్రో’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టకోవడానికి వస్తోంది నభా.

తొలుత ఈ సినిమాను థియేటర్‌లలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినప్పటికీ కరోనా కారణంగా ఓటీటీకే మొగ్గు చూపారు. సెప్టెంబర్ 17న ఈ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో నభా తాజాగా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నభా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘మ్యాస్ట్రో’ చిత్రాన్ని హిందీలో విజయవంతమైన ‘అందాధున్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. హిందీలో రాధికా ఆప్టే నటించిన పాత్రను నభా తెలుగులో పోషిస్తోంది.

ఇదే విషయమై నభా మాట్లాడుతూ.. ‘హిందీలో రాధికా ఆప్టే నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ స్థాయిలో నేను నటించగలనా అని భయపడ్డాను. రీమేక్‌లో నటించే అవకాశం రాగానే మళ్లీ మాతృకను చూడకూడదని నిర్ణయించుకున్నా. ఒరిజినల్‌ పాత్ర ప్రభావం లేకుండా నా శైలిలో పాత్రకు న్యాయం చేశాను’ అని చెప్పుకొచ్చింది. ఇక సినిమాను ఓటీటీలో విడుదల చేస్తుండడం పట్ల ఏమైనా అసంతృప్తిగా ఉన్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘కొవిడ్‌తో పాటు ప్రస్తుతం థియేటర్స్‌ పరంగా సమస్యలుండటంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదలచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీ అయితేనే అందరూ ఈ సినిమా చూడగలుగుతారని నమ్ముతున్నాం’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

Also Read: Allu Arjun: వావ్‌ వాటే సింప్లిసిటి.. రోడ్డు పక్కన టిఫిన్‌ చేసిన అల్లు అర్జున్‌. వైరల్‌ అవుతోన్న వీడియో..

Ram Charan: రామ్‌చరణ్‌ క్రేజ్‌ను వాడుకునే పనిలో పడ్డ ప్రముఖ ఓటీటీ సంస్థ.. బ్రాండ్‌ అంబాసిడర్‌ కోసం ఏకంగా..

Bigg Boss 5 Telugu: మగవారిని అడ్డం పెట్టుకొని ఆడుతుంది ఎవరు? హౌజ్‌లో దమ్మున్న మగాడు ఎవరు? సరయు సంచలన కామెంట్స్‌.