Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంపై స్పందించిన మోహన్‌ బాబు.. ఏమన్నారో తెలుసా.?

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ సెప్టెంబర్‌ 10 (శుక్రవారం) రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దుర్గం చెరువు తీగల వంతెన నుంచి ఐకియా స్టోర్‌ వైపు...

Sai Dharam Tej: సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంపై స్పందించిన మోహన్‌ బాబు.. ఏమన్నారో తెలుసా.?

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ సెప్టెంబర్‌ 10 (శుక్రవారం) రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దుర్గం చెరువు తీగల వంతెన నుంచి ఐకియా స్టోర్‌ వైపు వెళుతోన్న సమయంలో తేజ్‌ నడుపుతోన్న బైక్‌ స్కిడ్‌ కావడంతో ఒక్కసారిగా రోడ్డుపై జారుతూ వెల్లిపోయారు తేజ్‌. దీంతో ఆయనను హూటాహుటిగా దగ్గర్లో ఉన్న మెడికవర్‌ ఆసుప్రతికి తరలించారు. అనంతరం అక్కడ చికిత్స మొదలు పెట్టగా.. కుటుంబ సభ్యుల కోరిక మేరకు అపోలో ఆసుపత్రికి తరలించారు. తేజ్ కంటిపై భాగానికి, ఛాతికి, కాలికి గాయాలయ్యాయి. షోల్డర్ బోన్‌ విరగడంతో ఆయనకు సర్జరీ చేశారు వైద్యులు బృందం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

అపోలోలో చికిత్స పొందుతోన్న సాయి ధరమ్‌ తేజ్‌ను చూడడానికి కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ తారలు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు ఇతరులు కూడా వచ్చారు. తాజాగా తేజ్‌ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి నటుడు మోహన్‌ బాబు ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా వైద్యులతో తేజ్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం బయటకు వచ్చిన మోహన్‌ బాబు మీడియాతో మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ రెండు మూడు రోజుల్లోనే పూర్తి ఆరోగ్యంగా బయటకు వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. బాబా అంతా చూసుకుంటారని చెప్పిన మోహన్‌ బాబు తేజ్‌ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థించారు. ఇదిలా ఉంటే తేజ్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ట్రీట్‌మెంట్‌కు తేజ్‌ పూర్తిగా సహకరిస్తున్నారని, మరికాసేపట్లోనే వెంటిలేటర్‌ తొలగించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

Also Read: Nabha Natesh: ఆమె స్థాయిలో నేను నటించగలనా అని భయపడ్డాను.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఈస్మార్ట్‌ బ్యూటీ.

Allu Arjun: వావ్‌ వాటే సింప్లిసిటి.. రోడ్డు పక్కన టిఫిన్‌ చేసిన అల్లు అర్జున్‌. వైరల్‌ అవుతోన్న వీడియో..

Ram Charan: రామ్‌చరణ్‌ క్రేజ్‌ను వాడుకునే పనిలో పడ్డ ప్రముఖ ఓటీటీ సంస్థ.. బ్రాండ్‌ అంబాసిడర్‌ కోసం ఏకంగా..

Click on your DTH Provider to Add TV9 Telugu