Mamta Mohandas: ‘యమదొంగ’ హీరోయిన్‌కు ఏమైంది..? గుర్తు పట్టలేనంతగా మారిపోయిన నటి..వైరల్‌ అవుతున్న లేటెస్ట్‌ పిక్స్

ఈ పొగమంచులో నీ తొలికిరణాలు నన్ను తాకాలని బయటికి వస్తున్నాను. నీ దగ్గర ఉన్నదంతా నాకివ్వు. వాటి అవసరం నాకు చాలా ఉంది..జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోయిన్

Mamta Mohandas: యమదొంగ హీరోయిన్‌కు ఏమైంది..? గుర్తు పట్టలేనంతగా మారిపోయిన నటి..వైరల్‌ అవుతున్న లేటెస్ట్‌ పిక్స్
Mamta Mohandas

Updated on: Jan 16, 2023 | 9:23 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన ‘యమదొంగ’ సినిమాలో నెల్లూరు యాసతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌.. అప్పట్లో కుర్రకారును ఓ ఊపుఊపింది. ఈ మువీ బంపర్‌ హిట్‌ కొట్టడంతో సినిమా ఆఫర్లు వరుసకట్టాయి. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషల్లో హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గా కూడా మెరిసింది. ఐతే కొంతకాలం క్రితం క్యాన్సర్ మహమ్మారి బారినపడి మనో ధైర్యంతో జయించింది మమతా మోహన్‌దాస్‌. తాజాగా మమతా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పెట్టిన పోస్ట్‌ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాను Vitiligo అనే చర్మసంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు.. దీని కారణంగా చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నట్లు తన పోస్టులో తెల్పింది. మేకప్‌లేకుండా ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

‘డియర్ సన్‌ (Sun), మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు నీ కాంతి అవసరం నాకెంతో ఉంది. ప్రతి ఉదయం నీ కోసం ఎదురుచూస్తున్నాను. నా రంగును కోల్పోతున్నాను. ఈ పొగమంచులో నీ తొలికిరణాలు నన్ను తాకాలని బయటికి వస్తున్నాను. నీ దగ్గర ఉన్నదంతా నాకివ్వు. వాటి అవసరం నాకు చాలా ఉంది. నీ దయతో ఇక్కడ ఉన్నాను. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ తన పోస్టులో రాసుకొచ్చింది. ఇక మమతా మోహన్‌దాస్‌ తాజా పోస్టును చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. నువ్వు ధైర్యవంతురాలివి. నిన్ను ఇలాంటివి ఏం చేయలేవు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పలువురు మమతాకు ధైర్యం చెబుతూ మోటివేట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.