సినీపరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో హీరోయిన్ మాలా శ్రీ భర్త మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు..

MalaSri Husband: కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా పలువురు సినీ ప్రముఖులను కూడా

సినీపరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో హీరోయిన్ మాలా శ్రీ భర్త మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు..
Malasri Husband

Updated on: Apr 27, 2021 | 8:27 AM

MalaSri Husband: కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా పలువురు సినీ ప్రముఖులను కూడా ఈ మహమ్మారి బలి తీసుకుంటుంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటిలు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను కోల్పోగా.. తాజాగా సీనియర్ హీరోయిన్ మాలా శ్రీ భర్త కుణిగల్ రాము (52) కరోనాతో మరణించారు. గత మూడు రోజులుగా కరోనాతో పోరడుతున్న ఆయన సోమవారం సాయంత్రం కన్నుముశారు. కన్నడ పరిశ్రమలో కోటిరాముగా పేరుతెచ్చుకున్న రాము ఏకే 47, లాకప్ డెత్, కలాసిపాళ్యా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించాడు. ఇదిలా ఉంటే.. గతవారం ఆయన కాస్త అనారోగ్యంగా ఉండడంతో.. కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. అందులో పాజిటివ్ అని తేలీంది. అయితే శుక్రవారం నుంచి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో బెంగుళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేరారు. కాగా సోమవారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

ఇక మాలాశ్రీ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు పొందింది. కేవలం తెలుగులోనే కాకుండా. కన్నడ, తమిళ భాషలలో కూడా టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాము మరణ వార్తతో కన్నడ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నారు. పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

ట్వీట్..

Also Read: మళ్లీ తెరపైకి రానున్న ‘మాతృదేవోభవ’!!.. నయనతారతోపాటు మరో హీరోయిన్‏తో రీమేక్…

Pelli Sandadi 2: ఆ రోజునే దర్శకేంద్రుడి కొత్త పెళ్లి ‘సందడి’ మొదలయ్యేది..  డేట్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..