Actress Deepa: సినీ ఇండస్ట్రీలో విషాదం.. సినీ నటి దీప ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం..

పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Actress Deepa: సినీ ఇండస్ట్రీలో విషాదం.. సినీ నటి దీప ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం..
Deepa

Updated on: Sep 18, 2022 | 12:29 PM

తన ఆత్మహత్యకు ఎవరు బాధ్యులు కారంటూ ఓ యువనటి రాసిన సూసైడ్ నోట్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. తమిళ చిత్రపరిశ్రమకు చెందిన దీప అలియాస్ పౌలిన్ శనివారం చెన్నైలోని విరుగంబాక్కంలోని మల్లికై అవెన్యూలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత కొద్దిరోజులుగా ఒంటరిగా నివసిస్తున్న దీప సినిమాల్లో సహాయపాత్రలలో నటించి మెప్పించింది. కొంత కాలంగా దీప మానసిక ఒత్తిడికి గురైందని స్నేహితులు చెబుతున్నారు. మరోవైపు ప్రేమ వ్యవహరమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు దీప ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిన్నటి నుంచి దీప సంప్రదించడానికి ఆమె కుటుంబసభ్యులు ఫోన్ చేయగా.. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో తన స్నేహితుడు ప్రభాకరన్ ఇంటికి వెళ్లి చూడగా.. దీప ఫ్యాన్‏కు ఉరివేసుకుని కనిపించింది. ఆమె వద్ద దొరికిన సూసైడ్ నోట్‏లో తాను జీవితాంతం ఒకరిని ప్రేమిస్తానంటూ రాసుకొచ్చింది. కానీ అతని పేరును మాత్రం ప్రస్తావించలేదు. తన ఆత్మహత్యకు ఎవరు కారణం కాదంటూ ఆత్మహత్య లేఖ రాసింది దీప.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.