Vijay Devarakonda: డాన్సర్ కష్టం చూసి చలించిపోయిన రౌడీ హీరో.. ఆహా డాన్స్ ఐకాన్ కంటెస్టెంట్‏కు విజయ్ దేవరకొండ సాయం..

ఈ షోకు ముఖ్య అతిథిగా లైగర్ జోడీ విజయ్ దేవరకొండ..హీరోయిన్ అనన్యతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ చేసే ఫెర్ఫామెన్స్ చూసి ఫిదా అయ్యాడు రౌడీ హీరో.

Vijay Devarakonda: డాన్సర్ కష్టం చూసి చలించిపోయిన రౌడీ హీరో.. ఆహా డాన్స్ ఐకాన్ కంటెస్టెంట్‏కు విజయ్ దేవరకొండ సాయం..
Vijay Deverakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 18, 2022 | 8:53 AM

తెలుగు నటీనటులు కష్టాల్లో ఉన్న పేదవారికి సాయమందించడంలో ముందుంటారు (Vijay Devarakonda). ముఖ్యంగా అభిమానులకు చిన్న కష్టమొచ్చిన మేమున్నామని భరోసా కల్గించడమే కాకుండా.. ఆర్థికంగా సాయం చేస్తారు. మెగాస్టా్ర్ చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోస్ ఎంతో మంది పేదవారికి ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం తన మంచి మనసు చాటుకున్నారు. ఓ అభిమాని కష్టం విని చలించిపోయారు. అతని తల్లి త్రోట్ క్యాన్సర్‏తో బాధపడడం.. వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేని ఓ పేద డాన్సర్ కష్టాలకు ఎదుర్కొవడానికి తాను సాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా దేశవ్యాప్తంగా టాలెంట్ కలిగిన డాన్సర్ల కోసం డాన్స్ ఐకాన్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తుండగా.. ఓంకార్ హోస్ట్ గా చేస్తున్నారు. ఈ షో ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ లో గెలిచిన వారికి స్టార్ హీరోను కొరియోగ్రఫీ చేసే అవకాశం కల్పిస్తున్నారు మేకర్స్. ఈ షోకు ముఖ్య అతిథిగా లైగర్ జోడీ విజయ్ దేవరకొండ..హీరోయిన్ అనన్యతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ చేసే ఫెర్ఫామెన్స్ చూసి ఫిదా అయ్యాడు రౌడీ హీరో.

ఈషోలోకి అడుగుపెట్టిన ఆనంద్ అనే కంటెస్టెంట్.. తన తల్లి త్రోట్ క్యానర్ తో బాధపడుతుందని.. షోకోసం సరైన బట్టలు కూడా లేకపోవడంతో సాధారణ దుస్తులతో పాల్గోన్నట్లు ఓంకార్ చెప్పడంతో విజయ్ ఎమోషనల్ అయ్యాడు. తాను సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు రోజులను గుర్తుచేసుకున్నారు. తన మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యం సినిమా ప్రమోషన్లలో సమయంలో తనకు సరైన బట్టలు లేవని.. ప్రొడ్యూసర్ ను అడిగి సినిమాలో ఉపయోగించిన కాస్ట్యూమ్స్ మాత్రమే వేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే ఈషోలో తనకు కావాల్సిన కాస్టూమ్స్ మొత్తం తన సొంత బ్రాండ్ అయిన రౌడీ వేర్ నుంచి పంపుతానని.. తనకు నచ్చిన దుస్తులను ఎంచుకోవచ్చని. కేవలం డాన్స్ పై మాత్రమే దృష్టి పెట్టండి అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. విజయ్ మంచి మనసుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే