AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya: పిల్లలుండి హీరోయిన్లతో రొమాన్స్‌ చేసే హీరోలను ఎందుకు ప్రశ్నించరు.. అనసూయ సంచలన ట్వీట్‌..

అనసూయ: న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి యాంకర్‌గా, నటిగా ఎదిగారు అనసూయ. తనదైన చలాకీతనం, అందంతో ఆకట్టుకున్న అనసూయ బుల్లితెరతో పాటు వెండి తెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది. ఇక సోషల్‌ మీడియాలో..

Anasuya: పిల్లలుండి హీరోయిన్లతో రొమాన్స్‌ చేసే హీరోలను ఎందుకు ప్రశ్నించరు.. అనసూయ సంచలన ట్వీట్‌..
Anasuya Tweet
Narender Vaitla
|

Updated on: Oct 18, 2021 | 8:33 PM

Share

అనసూయ: న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి యాంకర్‌గా, నటిగా ఎదిగారు అనసూయ. తనదైన చలాకీతనం, అందంతో ఆకట్టుకున్న అనసూయ బుల్లితెరతో పాటు వెండి తెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ.. వివాదాలతోనూ నిత్యం సావాసం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సీనియర్‌ నటుడు కోటా శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలతో మరోసారి అనసూయ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కోటా.. అనసూయ వస్త్రధారణ గురించి పలు కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారు. అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదు. ఆమె చక్కటి నటి. కానీ ఆమె డ్రెస్సింగ్‌ నాకు నచ్చదు. ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే డ్రెస్సింగ్‌ మారిస్తే బావుంటుందని అంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే ఈ వార్త వైరల్‌గా మారడంతో ఈ వివాదంపై ఎట్టకేలకు అనసూయ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ఓ పెద్ద పోస్ట్‌ చేశారు అనసూయ. ఇందులో ఆమె మహిళల వస్ర్తధారణపై సమాజం ఆలోచన పట్ల తప్పు పట్టారు. ఓ సీనియర్‌ నటులు చేసిన కామెంట్స్‌ తన దృష్టికి వచ్చాయని చెప్పుకొచ్చిన అనసూయ.. ‘ఎలాంటి దుస్తులు ధరించాలనేది ఒక వ్యక్తి వ్యక్తిగత విషయం. అది వృత్తిపరమైన ఎంపిక కూడా అయ్యుండొచ్చు. ఇక ఈ సోషల్‌ మీడియా ఇలాంటి అనవసరమైన కంటెంట్‌ను ఎందుకు హైలైట్‌ చేస్తుందో అర్థం కావడం లేదు. ఆల్కహాల్‌ తీసుకునే సన్నివేశాలు, అద్వాన్నమైన దుస్తులు ధరిస్తూ, మహిళలను అవమానపరిచే సన్నివేశాల్లో నటించిన ఆ సీనియర్ నటుడుని ఎందుకు ప్రశ్నించలేరు’ అని పేర్కొంది.

అంతటితో ఆగని అనసూయ.. ‘పెళ్లి చేసుకొని పిల్లలున్న హీరోలు.. తెరపై హీరోయిన్లతో ఎందుకు రొమాన్స్‌ చేస్తున్నారో ఎవరైనా ప్రశ్నించారా.? చొక్కా లేకుండా హీరోలు తమ శరీరాలను చూపిస్తే ఎందుకు అడగరు. పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్న నా లాంటి మహిళ జీవితంలో విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో కష్టపడి పనిచేస్తూ.. పురుషాధిపాత్యాన్ని ప్రశ్నిస్తుంటే మిమ్మల్ని భయపెడుతున్నట్లా.. ఒకవేళ అదే అనుకుంటే మీ వ్యక్తిగత అభిప్రాయాలను అందరు ముందు చెప్పేకంటే, మీ పని మీరు చేసుకోండి’ అంటూ సుదీర్ఘమైన పోస్ట్ చేసింది.

Also Read: Bangladesh: బంగ్లాదేశ్‎లో కొనసాగుతున్న హింస.. ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు!..

Samantha: నయనతార దారిలో సామ్‌…కొత్త సినిమాలకు కొత్త కండిషన్లు!!

Electronic Nose: కేన్సర్ వ్యాధిని గుర్తించే ఎలక్ట్రానిక్ ముక్కు.. నిమిషాల్లో వ్యాధి నిర్ధారణ చేసేయొచ్చు.. ఇదెలా పనిచేస్తుందంటే..

Follow Us