Amala Paul: 2009లో మలయాళం చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార అమలాపాల్. తనదైన సహజ నటన అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తొలిసారి నాగచైతన్య హీరోగా తెరకెక్కిన బెజవాడతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అనంతరం తమిళ్‌తో పాటు తెలుగులోనూ నటిస్తూ మెప్పిస్తోందీ బ్యూటీ. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా పిట్ట కథలు, కుడి ఎడమైతే వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించింది. ఇక తాజాగా ‘కడవర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అమలాకు నటిగా మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది.
ఈ సినిమా ఇచ్చిన విజయంతో మంచి జోష్ మీదున్న ఈ బ్యూటీ ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇక సినిమాలతో పాటు తన వ్యాఖ్యలు, వ్యక్తిగత జీవితం విషయంలోనూ అమలా నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. గతంలో ఈ బ్యూటీ చేసిన కొన్ని వ్యాఖ్యలు, నటించిన కొన్ని పాత్రలు కాంట్రవర్సీకి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి కాంట్రవర్సీలు వచ్చినా తన నటనతో సమాధానం చెబుతూ వస్తోందీ చిన్నది. ఇక నిత్యం సినిమాలతో బిజీగా ఉండే అమలా.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అమలా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వైట్ డ్రస్‌లో దిగిన హాట్ హాట్ ఫొటోలు నెటిజన్ల మనసులు దోచేస్తున్నాయి. కళ్లకు కాటుకతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమలా చేసిన ఈ పోస్ట్‌కు ఆమె ఫ్యాన్స్ తెగ లైక్‌లు కొడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..