AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Vishal: CM విజయ్‌ను కలిసిన నటుడు విశాల్.. బొకేకు బదులు ఏమిచ్చారో తెలుసా?

ఇటీవలే ఎన్నిలకల్లో విజయం సాధించిన తమిళనాడు సీఎంగా బాధ్యలు చేపట్టిన టీవీకే చీఫ్, నటుడు విజయ్‌ను సినీ నటుడు విశాల్ కలిశాడు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు ముచ్చటించారు. తాను సీఎం విజయ్‌ను కలిసినట్టు నటుడు విశాత్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకోచ్చారు. అవేంటో చూద్దాం పదండి.

Actor Vishal: CM విజయ్‌ను కలిసిన నటుడు విశాల్.. బొకేకు బదులు ఏమిచ్చారో తెలుసా?
Vishal Meets Cm Vijay
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 16, 2026 | 3:28 PM

Share

తమిళనాడు ముఖ్యమంత్రిగా నటుడు విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి చాలా మంది కోలీవుడ్ స్టార్స్ ఒక్కొక్కరిగా వెళ్లి ముఖ్యమంత్రి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలుస్తూనే ఉన్నారు. తాజాగా విశాల్ కూడా తన స్నేహితుడు అయిన సీఎం విజయ్‌ని కలిశారు. ఈ మేరకు ఆయన ఈ భేటీ గురించి పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్‌లో విశాల్ ఇలా రాసుకొచ్చారు.. లయోలా కాలేజీలో మన పరిచయం ఏర్పడిన నాటి నుంచి నేను మిమ్మల్ని ‘డార్లింగ్’ అని పిలుస్తూనే ఉన్నాను.. అందులో ఎలాంటి మార్పు రాలేదు. ఓ సాధారణ హీరోగా మొదలైన మీ ప్రయాణంలోని అన్ని అడ్డంకులను, విమర్శలను ఎదుర్కొని, మీ మౌనంతో, విజయంతో వాటన్నిటినీ పక్కకు నెట్టేశారు. ఒక సూపర్‌స్టార్‌గా మీరు ఉన్నత శిఖరాలకు ఎదిగి ఈనాడు తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి అయ్యారు.

ఈ రోజు పదవి, హోదా మారాయి.. కానీ మీరు మాత్రం మారలేద అని విశాల్ రాసుకొచ్చారు. మిమ్మల్ని కలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది, అదే ఆప్యాయతను మళ్లీ అనుభూతి చెందాను. ఎంజీఆర్ గారి నుంచి.. జయలలిత అమ్మ వరకు, స్టాలిన్ అంకుల్ నుండి నా ప్రియ సోదరుడు ఉదయ నిధి స్టాలిన్ వరకు.. మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ‘డార్లింగ్’ అని పిలవడం ఎంతో ముచ్చటగా అనిపించింది. నాలోని ఈ మధుర క్షణాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని విశాల్ అన్నారు.

మీ కోసం తీసుకు రావాల్సిన బొకే, శాలువాకి బదులుగా ఆ డబ్బును మీ తరపున, మీ పేరు మీద తమిళనాడులోని ముగ్గురు అర్హులైన నిరుపేద బాలికల చదువు కోసం ఉపయోగించినందుకు మీకు ధన్యవాదాలు. వారు మిమ్మల్ని చూసి గర్వపడతారు, మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. మీ పాలనలో తమిళనాడు అత్యుత్తమంగా రాణించాలని ఎదురుచూస్తున్నాను’ అని విశాల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us