AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నువ్వు చాలా గ్రేట్ అన్న! ట్రైన్‌లో జనరల్ బోగీలో ప్రయాణించిన హీరో.. కారణం ఇదే

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి చెప్పక్కర్లేదు. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో అటు తమిళ్.. ఇటు తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. బిచ్చగాడు హిట్ తర్వాత విజయ్ ఆంటోని నటిస్తున్న ప్రతి సినిమాను ఇటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు.

నువ్వు చాలా గ్రేట్ అన్న! ట్రైన్‌లో జనరల్ బోగీలో ప్రయాణించిన హీరో.. కారణం ఇదే
Vijay Antony
Rajeev Rayala
|

Updated on: Nov 22, 2026 | 9:13 AM

Share

సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి బజ్ తీసుకురావడానికి హీరోలు రకరకాల ప్రచార వ్యూహాలను అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా ప్రమోషన్లతో పాటు నేరుగా ప్రజల్లోకి వెళ్లి తమ సినిమాలను పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు విజయ్ ఆంటోనీ ఎంచుకున్న వినూత్న ప్రచార పద్ధతి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు బిచ్చగాడు, బిచ్చగాడు 2 చిత్రాలతో సుపరిచితమైన విజయ్ ఆంటోనీ తాజాగా ‘అప్పాకుట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగులో ఈ సినిమాను నాన్న కుట్టి అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి మరింత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ఆయన వినూత్న ఆలోచన చేశారు.

వామ్మో.. కిక్ మూవీలో ఇలియానా చెల్లి ఎంత మారిపోయింది..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే

సినిమా ప్రమోషన్ కోసం ఎలాంటి హంగామా లేకుండా సాధారణ ప్రయాణికుడిలా రైలు ఎక్కారు. తన చిత్ర బృందంతో కలిసి చెన్నై నుంచి కోయంబత్తూర్ వెళ్లే కోవై ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు విజయ్. రైలులోని జనరల్ బోగీలో తోటి ప్రయాణికుల మధ్య కూర్చుని వారితో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన కొత్త సినిమా గురించి వివరించి, చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఒక స్టార్ హీరో తమ మధ్యే సాధారణ వ్యక్తిలా ప్రయాణిస్తుండటంతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఆ హీరో నా రూమ్మేట్.. ఎన్నో కష్టాలు పడ్డాం! ఇద్దరం ఒకేసారి సినిమాల్లోకి వచ్చాం

సినిమా ప్రమోషన్ కోసం భారీ ఈవెంట్లు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే ఈ రోజుల్లో విజయ్ ఆంటోనీ ఇలా నేరుగా సామాన్య ప్రజల మధ్యకు వెళ్లడం ప్రత్యేకంగా నిలిచింది. ఆయన రైలు ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనదైన శైలిలో ప్రమోషన్ చేసిన విజయ్ ఆంటోనీ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి ఇలాంటి కొత్త ప్రయత్నాలు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి. తెలుగులోనూ విజయ్ కు మంచి క్రేజ్ ఉంది.

ఆ హీరో వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.. ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను: మురళి మోహన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us