కనిపించే‌ మూడు సింహాలు పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులే: సాయి కుమార్

| Edited By:

Oct 20, 2020 | 8:46 AM

కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే.. కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్‌ అంటూ ఓ మూవీలో సాయి కుమార్ చెప్పిన డైలాగ్‌ని

కనిపించే‌ మూడు సింహాలు పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులే: సాయి కుమార్
Follow us on

Sai Kumar visits Tirumala: కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే.. కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్‌ అంటూ ఓ మూవీలో సాయి కుమార్ చెప్పిన డైలాగ్‌ని ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. ఆ తరువాత ఈ డైలాగ్‌ని ఎన్నో సినిమాల్లోనూ వాడుకున్నారు. అయితే ఇప్పుడు ఆ డైలాగ్‌ని మరో వెర్షన్‌లో చెప్పారు సాయి కుమార్. కనిపించే‌ మూడు సింహాలు పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులని ఆయన అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయి కుమార్.. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులకు సెల్యూట్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిజమైన హీరోలు పోలీసులే అని, పోలీసు గెటప్ వేస్తేనే తమలో‌ ఒక పౌరుషం కనిపిస్తుందని, ఇక నిజమైన పోలీసులకి ఇంకా ఎంత షౌరుషంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. పోలీస్ స్టోరీ చేసి 25 సంవత్సరాలు పూర్తి అయిందని, త్వరలోనే నాలుగో సింహం అని మరో పోలీస్ స్టోరీలో నటించబోతున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డిపై సాయి కుమార్ ప్రసంశలు కురిపించారు. పోలీస్ అధికారి యూనిఫామ్‌లో పొలంలో వరినాటడం తనకు నచ్చిందని, ఇలాంటి అధికారి ప్రజల్లో ఎలా కలిసిపోతారో అర్ధం చేసుకోవచ్చునని పేర్కొన్నారు. రమేష్ రెడ్డి లాంటి‌ అధికారి ఉన్న చోట మానవత్వం కూడా ఉంటుందని సాయి కుమార్ పొగడ్తలతో ముంచెత్తారు.

Read More:

Bigg Boss 4: మోనాల్‌ కోసం అరియానా రాయబారం.. నోరు జారిన అభిజిత్‌

Bigg Boss 4: అరియానాపై హౌజ్‌మేట్స్ ప్రశంసలు.. సొహైల్‌ టచ్‌ చేశాడుగా