Throwback Photo: థ్రో బ్యాక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌లా మారాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తమ చిన్ననాటి ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. అయితే ఇప్పుడీ ట్రెండ్‌ను హీరోలు కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు పలువురు హీరోలు సైతం తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి యంగ్ హీరో నిఖిల్ కూడా వచ్చి చేరాడు.
తాను చిన్నతనంలో దిగిన ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. గోల్డ్ కలర్ కోట్‌లో చిన్నప్పుడే హీరోలా కనిపిస్తున్న ఈ ఫోటోను పోస్ట్ చేసిన నిఖిల్.. ‘నాన్నతో నేను.. నేను పదేళ్ల వయసులో ఉన్నప్పుడు దిగిన ఫోటో ఇది’ అని రాసుకొస్తూ, ఈ పాత జ్ఞాపకాన్ని తనకు అందించిన స్నేహితుడిని ట్యాగ్ చేశాడు నిఖిల్. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే నిఖిల్ ప్రస్తుతం ‘కార్తికేయ 2’తో పాటు ’18 పేజీస్’ చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు మరికొన్ని సినిమాలను లైన్‌లో పెట్టేందుకు నిఖిల్ సన్నాహాలు చేస్తున్నాడు.
Also Read: Manchu Vishnu: ‘మా’ ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా మంచు విష్ణు.. పలు ఆస్పత్రులతో ఒప్పందాలు..
Krithi Shetty: బేబమ్మ ముద్దు పెట్టేసింది !! వీడియో